VH:త్వరలో బీసీ గర్జన కార్యక్రమం చేపడుతాం తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించగా.. బీసీ ప్రతిపాధికన సీట్ల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. By Karthik 19 Aug 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి VH About BC Garjana: తెలంగాణలో రోజు రోజుకూ ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) మాత్రం సీట్లను ఒకే వర్గానికి అధికంగా కేటాయించవద్దని, సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (V Hanumantha Rao) గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీట్ల కేటాయింపులో బీసీ జనాభా ప్రతిపాధికన ఉంటుందన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 54 శాతం మంది బీసీలే ఉన్నారని వీహెచ్ అన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఇప్పటికే బీసీ మీటింగ్‌లు జరిగాయని తెలిపారు. రానున్న రోజుల్లో బీసీ గర్జన పెట్టబోతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వెల్లడించారు. షాద్ నగర్ వేదికగా బీసీ గర్జన సభ నిర్వహించనున్నట్లు తెలిపిన ఆయన.. ఈ సభ సెప్టెంబర్ 6 లేదా 9వ తేదీల్లో నిర్వహిస్తామన్నారు. మూడు లక్షల మందితో సభ నిర్వహిస్తామన్న ఆయన.. ఈ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాల్లో హైదరాబాద్‌ను పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు నగరంలో ఆర్భాటం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గతంలో మున్సిపాలిటీని అధ్వానంగా ఉందని.. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే మురికి మయంగా మారిన ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీని తొలగించిందని గుర్తు చేసిన ఆయన.. ఎంపీకి ప్రభుత్వ పరంగా ఉండాల్సిన భద్రతను తొలగించడం ఏంటన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల మధ్య తిరుగే వ్యక్తని,, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాని వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని హనుమంతరావు ఆరోపించారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరికి మరొకరు సహకరించుకుంటున్నారని విమర్శించారు. దీనిని ప్రజలు గమనించాలన్న ఆయన.. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని.. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అవుతుందన్నారు. Also Read: ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం #brs #kcr #congress #bjp #revanth-reddy #tickets #mla #v-hanumantha-rao #bc-garjana #vh-about-bc-garjana #bc-garjana-program #congress-bc-garjana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి