Mla Danam Nagender: సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి షాక్ ఇచ్చారు. ఖైరతాబాద్‌లో హైడ్రా(Hydra) కూల్చివేతలను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా కూల్చివేతలు ఎలా చేపడుతారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు.
Also Read: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థికశాఖ.. మహిళా సంఘాలతో కలిసి సోలార్ ప్లాంట్లు
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!
చింతల్ బస్తీలో దానం హల్ చల్..
హైదరాబాద్‌లోని చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం హల్ చల్ చేశారు. హైడ్రా అధికారులు షాదన్ కాలేజ్ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. "ఏడికెళ్లో బతకనీకి వచ్చి మమ్మల్ని బతకనీయకుండా చేస్తుండ్లు' అంటూ దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మాట వినకుంటే నా ఎమ్మెల్యే పదవి పోయిన మంచిదే ఇక్కడే కూర్చుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏ విషయమైన నోటీసు లేకుండా ఎట్ల చేస్తారు మా ఏరియాల అంటూ ప్రశ్నించారు. మీరు ఆపండి మీరు ఆపకుంటే ఆ బండి ముందు కూర్చుంటా. బండి ముందు కూర్చోవాల్నా, ఆపుతరా? అట్లాంటి నిర్మాణాలు వంద ఉన్నాయి నేను చూపిస్త. నా ఎంబటి రండి. పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు ఉన్నయి. అవి కూలగొట్టండి ముందు. ఇక్కడ మీరు ఆపండి ఆపకుంటే మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుద్ది అంటూ హెచ్చరించారు.
Also Read: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. బీఆర్ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
రెండు రోజులు ఆపండి, సీఎం రేవంత్ రెడ్డి వచ్చినంక నేను మాట్లాడుతా అంటూ వారికి సూచించారు. లేదంటే ఆందోళన చేస్తానని హెచ్చరించారు. నేను ముప్పై ఏండ్ల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నానని, నాకు తెల్వని ప్రాబ్లమ్ ఏంటని దానం ప్రశ్నించారు. అంతకుముందు దానం నాగేందర్ హైడ్రాపై మాట్లాడుతూ.. స్లమ్ ఏరియాల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పానన్నారు. జలవిహార్, ఐమ్యాక్స్ లాంటివి చాలా ఉన్నాయని.. వాటిని కూల్చుకోవాలని సూచించారు. పేదల ఇండ్లను కూల్చడం సరికాదని దానం నాగేందర్ అన్నారు.
Also Read: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!