Asia Cup 2023: పెద్ద ఆటగాళ్ళకు రెస్ట్...ఇండియా-బంగ్లా మ్యాచ్ లో టీమ్ ఛేంజ్? ఆసియా కప్ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసేసుకుంది. ఇప్పుడు సూపర్-4 లో పాక్, శ్రీలంక లతో ఆడిన ఇండియా బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ అవుతోంది. అయితే ఈమ్యాచ్లో రోహిత్, కోహ్లీతో పాటూ మరో ఆటగాడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India vs Bangladesh: ఆసియా కప్ లో భారత్ ఫైనల్ కు వెళ్ళిన మొదటి జట్టుగా నిలిచింది. సూపర్ -4లో ఇండియా ఇంకా బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంది. అయితే ఇది కేవలం షెడ్యూల్ లో ఉంది కాబట్టి ఆడాలి అంతే కానీ ఇండియాకు దీని వలన పెద్దగా ఉపయోగం లేదు. గెలిచినా, ఓడిపోయినా కూడా నష్టం లేదు. అందుకే ఈ మ్యాచ్ లో సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ నామ మాత్రపు మ్యాచ్ కోసం కెప్టెన్ రోమిత్ తో పాటు విరాట్ కోహ్లీ, పేసర్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వానలి మేనేజ్ మెంట్ అనుకుంటోందని సమాచారం. ఇప్పుడు వీళ్ళకు రెస్ట్ ఇస్తే నెక్స్ట్ ఫైనల్ లో మళ్ళీ బాగా ఆడడానికి బలం పుంజుకుంటున్నారని భావిస్తున్నారు. భారత్ కంటిన్యూస్ గా మ్యాచ్లు ఆడుతూనే ఉంది. సూపర్ -4 లో పాకిస్తాన్ తో మొదటి రోజు మ్యాచ్ వర్షం కాణంగా రద్దయింది. దాంతో మర్నాడు రిజర్వ్ డే నాడు ఆడాల్సి వచ్చింది. దాని తరువాత వెంటనే మరుసటి రోజు శరీలంకతో మ్యాచ్ ఆడారు. దీంతో ఆటగాళ్ళకు రెస్ట్ దొరకలేదు. దీనివల్ల క్రికెటర్లలో ఒత్తిడి పెరిగిపోయి ఉంటుందిన మేనేజ్ మెంట్ భావిస్తోంది. రోమిత్, విరాట్ కోహల్ఈలు వయసు పరంగా కూడా పెద్దవారు. ఈ విషయాన్ని స్వయంగా విరాటే ప్రెస్ మీట్ లో మెన్షన్ కూడా చేశాడు. ఇలాంటి సమయంలో నామమాత్రపు మ్యాచ్ లో వీళ్ళను ఎందుకు ఆడించడం అనుకుంటోంది మేనేజ్ మెంట్. ఇప్పుడు విశ్రాంతి ఇస్తే పైనల్ మ్యాచ్ కు ఫ్రెష్ గా రీ ఎంట్రీ ఇస్తారని భావిస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ బంగ్లాతో మ్యాచ్ లో ఆడకపోతే కెప్టనె గా హార్విక్ పాండ్యా వచ్చే అవకాశం ఉంది. అలాగే శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ లను ఆడించే అవకాశం ఉంది. ఇక బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉంది. Also Read: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్-పాక్ తలపడాలంటే.. ఏం జరగాలి..? #virat-kohli #cricket #bangladesh #india #asia-cup #match #rest #india-vs-bangladesh #super-4 #rohith-sharma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి