/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rashmika-2-1-jpg.webp)
National Crush Rashmika Insta Post : తెలుగు, కన్నడ, హిందీల్లో రష్మిక(Rashmika Mandanna) బిజీ హీరోయిన్ అయిపోయింది. పుష్ప(Pushpa) తో వచ్చిన స్టార్ డయ్ యానిమల్(Animal) సినిమాతో మరింత పెరిగిపోయింది. దీంతో ఆమె క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ముంబయ్(Mumbai) కి, హైదరాబాద్(Hyderabad) కి చక్కర్లు కొట్టేస్తోంది. తాజాగా సినిమా షూటింగ్ నిమిత్తం ముంబయ్ వెళ్ళిన రష్మిక హైదరాబాద్ తిరిగి వస్తోంది. అయితే ముంబయ్‌లో ఆమె ఎక్కిన విమానంలో బయటుదేరిన కొద్దిసేపటికే ఏదో ప్రాబ్లెమ్ వచ్చింది. దీంతో ౩౦ నిమిషాలు ప్రయాణం చేసిన విమానాన్ని మళ్ళీ ముంబయ్ తీసుకువచ్చి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
Also Read : Exam Tips : ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారా? ఈ టిప్స్ పాటిస్తే మిగిలిన పరీక్షల్లో మీరే టాపర్!
కంగారుపడిపోయిన రష్మిక...
విమానంలో సాంకేతికలోపం అనగానే తాను చాలా కంగారు పడిపోయానని అంటోంది రష్మిక. ఏమవుతుందో అనుకున్నాం. కానీ అలా బతికి బయటపడిపోయాము అని చెబుతోంది. రష్మిక వచ్చిన ఇదే ఫ్లైట్‌లో మరో హీరోయిన్ శ్రద్ధాదాస్(Shraddha Das) కూడా ఉంది. విమానం ముంబయ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి ఒక పిక్ తీసుకుని... తమకు అయిన అనుభవాన్ని ఆ పిక్‌కు జత చేస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది రష్మిక. ఎయిర్ ప్లైన్‌లో ఇష్యూలో ఎవరికీ ఏం కాలేదని... ప్రయాణికులు అందరూ సురక్షితంగానే ఉన్నారని చెప్పింది రష్మిక.
ఫోర్బ్స్ లిస్ట్‌లో...
ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్ప-2(Pushpa-2) లో నటిస్తోంది. దీంతో పాటూ గర్ల్ ఫ్రెండ్(Girl Friend) అనే మూవీలో మరో లేడీ ఓరియెంటెండ్ సినిమాలో కూడా నటిస్తోంది. యానిమల్‌తో మాత్రం సూపర్ స్టార్ డమ్ తెచ్చుకుంది నేషనల్ క్రష్. తాజాగా ఫోర్బ్స్ ఇండియా(Forbes India) ప్రకటించిన లిస్ట్‌లో రష్మిక స్థానం సంపాదించుకుంది. ఇండియాలో టాప్ ౩౦ ఎంట్రప్రెన్యూర్స్, స్టార్స్, ఇన్నోవేటర్స్ లిస్ట్ ను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక ఉంది.
View this post on Instagram
Also Read : షర్మిల కుమారుడు రాజారెడ్డి హల్దీ వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు