/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mahesh-1-jpg.webp)
మహేష్ బాబు(Mahesh babu) నుంచి సినిమా వస్తుంది అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram srinivas) తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా సినిమా పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు పూజా హెగ్డేని (Pooja hegde) అనుకోగా ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో శ్రీలీల (Sreeleela) నటిస్తుంది.
రెండవ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు కానీ, లిరికల్ సాంగ్స్ కానీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళి (Rajamouli) కాంబోలో సినిమా రాబోతుందని ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ ఆర్ తరువాత జక్కన్న నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో తమిళ స్టార్ హీరో విక్రమ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఆయన ఈ సినిమాలో విలన్ పాత్రలో ఆస్కారం ఉందని టాక్ వినిపిస్తోంది. దీని గురించి పూర్తి క్లారిటీ లేకపోయినప్పటికీ విక్రమ్ మాత్రం తప్పకుండా నటిస్తున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ నటన గురించి అందరికీ తెలిసిందే. ఇక జక్కన్న చేతిలో కి వచ్చిన తరువాత ఈ హీరో అయినా సరే వారిని ఎంతలా వాడేసుకుంటారో తెలిసిందే.
మరి ఇప్పుడు విక్రమ్ నుంచి ఎలాంటి నటన రాబట్టుబోతున్నాడో వేచి చూడాలి. అయితే విక్రమ్ ఈ సినిమాలో నటిస్తుంది లేదు అనే దాని గురించి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
Also read: అమెరికాలో భారత విద్యార్థి ని 8 నెలలుగా నిర్బంధించి..చిత్ర హింసలు!