సీఎం రేవంత్ ను కలిసిన గుమ్మడి నర్సయ్య-VIDEO
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పలు సమస్యలను సీఎంకు వివరించి.. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పలు సమస్యలను సీఎంకు వివరించి.. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లిన పవన్.. నాగబాబు మంత్రి పదవిపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాజధాని పున:ప్రారంభ పనులు, మోదీని ఆహ్వానించే అంశం గురించి డిష్కస్ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదని మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. కేబినెట్లోకి కౌన్సిల్ నుంచి తీసుకునే అవకాశం లేదన్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు.
కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన MLC తీన్మార్ మల్లన్న నేడు BRS కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ను కలిశారు. బీసీ బిల్లులో లోపాలపై పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు BRS, ఆ పార్టీ నేతలపై ఒంటి కాలిపై లేచిన మల్లన్న సడన్ గా రూటు మార్చడం హాట్ టాపిక్ గా మారింది.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి ఇందుకు అనుమతులు తీసుకురావాలన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని తక్కువగా చూడడం లేదన్నారు.
రేవంత్.. నీ ఎఫైర్స్ బయటపెట్టాలా అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. అడ్డమైన వాళ్లతో తమకు లింకులు పెట్టినప్పుడు రేవంత్‌కు విలువలు గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు.
ఏపీలో రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న టెన్త్ విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని.. ఎలాంటి ఒత్తికి గురి కాకుండా ఎగ్జామ్స్ రాయాలని సూచించారు. సకాలంలో కేంద్రాలకు రావాలన్నారు.
RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఆంధ్ర మతసేనా పార్టీగా మార్చారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారన్నారు. బీజేపీ మైకం నుంచి బయట పడాలని పవన్ కు సూచించారు.
జనసేన అధినేత పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి నాగబాబును ఇన్ఛార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేయడంతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా నాగబాబే చూస్తారని పార్టీలో చర్చ సాగుతోంది.