కేటీఆర్, హరీష్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలవడం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ అగ్రనేతలపై దుమ్మెత్తి పోసిన మల్లన్న.. ఇప్పుడు వారితో భేటీ కావడం వెనుక కారణం ఏంటనే అంశంపై చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ తో మల్లన్నకు సఖ్యత కుదిరిందన్న ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ లాబీలో హరీష్ రావు, కేటీఆర్ తో భేటీ అయిన తీన్మార్ మల్లన్న బీసీ బిల్లు, సమస్యలపై చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: KTR Vs Revanth: రేవంత్ అఫైర్లు బయటపెడతా.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!
బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న..
— Telangana Awaaz (@telanganaawaaz) March 17, 2025
బీసీ రిజర్వేషన్ బిల్లు పై సభలో ప్రభుత్వాన్ని గట్టిగ నిలదీయాలని కోరిన ఎమ్మెల్సీ మల్లన్న..@KTRBRS @BRSparty @TeenmarMallanna @BRSHarish @sravandasoju pic.twitter.com/6mlVGWUYsy
బీసీ బిల్లుపై పోరాటానికి వినతి..
ప్రభుత్వం తెస్తున్న బీసీ బిల్లులో అవకతవకలపై పోరాటం చేయాలని మల్లన్న కోరినట్లు తెలుస్తోంది. బీసీలకు న్యాయం జరిగేలా కొట్లాడాలని మల్లన్న విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్న సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. బీసీ కులగణన రిపోర్టును తగలబెట్టడంతో పాటు, ఓ వర్గం వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. షోకాజ్ నోటీస్ ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. పోలీసులకు ఏం చెప్పారంటే