విజయశాంతికి మంత్రి పదవి ఉండదు.. అలాంటివి KTRకే తెలుసు.. మంత్రి సురేఖ సంచలన కామెంట్స్!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదని మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. కేబినెట్లోకి కౌన్సిల్ నుంచి తీసుకునే అవకాశం లేదన్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు.

New Update

కేబినెట్ విస్తరణపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో పలు విషయాలపై ఆమె మాట్లాడారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదన్నారు. ఉన్నా.. కౌన్సిల్ నుంచి అవకాశం ఇస్తారా లేదో చూడాలన్నారు. కౌన్సిల్‌లో చాలా మంది సీనియర్లు ఉంటారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సైతం సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఎదుటివారి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని అని అన్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
ఇది కూడా చదవండి: Teenmar Mallanna: కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?

 

వివాదాలు సృష్టించేలా బీజేపీ సభ్యుల వ్యాఖ్యలు

వివాదాలు సృష్టించేలా బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారన్నారు. ఆర్కీయాలజీ, దేవాదాయ, టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లు యూనిట్ గా చేస్తేనే టెంపుల్ టూరిజం పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాకరించకుండా పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. తనకు పురాతన ఆలయాల అభివృద్ధి కోసం రోజు దరఖాస్తులు వస్తున్నాయన్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశామన్నారు. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుందన్నారు.  
ఇది కూడా చదవండి: CM Revanth: చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!

 

Advertisment
Advertisment
Advertisment