/rtv/media/media_files/2025/03/16/RktpU0n1zXdUpyxxAUPx.jpg)
Nagababu Pawan Kalyan
ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు ప్రస్తుతం పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పవన్ సూచన మేరకు నిన్న పారిశుధ్య కార్మికులను సన్మానించారు. అయితే.. రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగానే నాగబాబు పని చేయనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం కావడంతో పవన్ రాష్ట్రమంతా పర్యటించాల్సి వస్తుంది. దీంతో పిఠాపురానికి ఆయన పెద్దగా సమయం కేటాయించలేకపోతున్నారు. ఇన్ని రోజులు నాగబాబుకు ఎలాంటి పదవి లేదు. దీంతో ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాగబాబుకు పవన్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించినట్లు జనసేన వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: లోన్ వస్తే నాతో ఎంజాయ్ చేయాలి.. టీడీపీ లీడర్ రాసలీలల ఆడియో లీక్!
జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచన మేరకు ఈ రోజు పిఠాపురంలో పారిశుధ్య కార్మికులను సత్కరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు, శాసన మండలి ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు. pic.twitter.com/lqOakOrzhb
— JanaSena Party (@JanaSenaParty) March 15, 2025
వారానికి నాలుగైదు రోజులు అక్కడే..
ఇక నుంచి వారానికి నాలుగైదు రోజులు అక్కడే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. పిఠాపురంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీ బాధ్యతలను కూడా నాగబాబు చూసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. స్థానిక ఎన్నికల నాటికి పిఠాపురంలో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని నాగబాబు టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pawan kalyan: నేను హిందీని వ్యతిరేకించలేదు.. పవన్ సంచలన పోస్ట్!
మంత్రి పదవి ఎప్పుడు?
నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు గతంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడం ఆయనకు ఇన్నాళ్లు మంత్రి పదవికి అడ్డంగా మారింది. ఇప్పుడు మండలిలో అడుగు పెట్టడంతో ఆ పరిస్థితి మారింది. దీంతో ఆయనను మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకుంటారు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.