/rtv/media/media_files/2025/03/16/GLLiwBtJJdLChGy0Kf1M.jpg)
Nara Lokesh all the best to tenth students
ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులంతా చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎటువంటి ఒత్తిడికి గురికావద్దన్నారు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇదన్నారు. ప్రశాంతంగా ఉండండి.. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయాలని సూచించారు. మరో వైపు టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షకు వెళ్లే విద్యార్థులకు పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Nagababu: ఇక నాగబాబు కేరాఫ్ పిఠాపురం.. అన్నకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్!
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి. ఎటువంటి ఒత్తిడికి గురికావద్దు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇది.…
— Lokesh Nara (@naralokesh) March 16, 2025
మొత్తం 3,450 సెంటర్లు..
ఇదిలా ఉంటే.. ఏపీలో రేపటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతీరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిజిక్స్, బయోలజీ పరీక్షలు పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Sharmila Vs Pawan: జనసేన పార్టీకి కొత్త పేరు పెట్టిన షర్మిల.. సంచలన ట్వీట్!
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు కలిపి మొత్తం 6.15 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 3,450 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ టీమ్స్ ను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. హాల్ టికెట్ల పంపిణీని ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.