విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. ఏపీ సీఐడీ నోటీసులు!

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

New Update
Vijayasai Reddy

Vijayasai Reddy

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపు వ్యవహారంలో ఏపీ సీఐడీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 10న ఓ సారి నోటీసులు జారీ చేసింది సీఐడీ. ఈ నోటీసులకు సంబంధించి 12న ఇప్పటికే ఆయన విచారణకు హాజరయ్యారు. తొలిసారి విచారణకు హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసు అని అభివర్ణించారు. పోర్టు యజమాని కేవీ రావుతో ముఖపరిచయం తప్పా ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. విక్రాంత్ రెడ్డి తనకు వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రమే తెలున్నారు. అయితే ఓ మిత్రుడి ద్వారా ఈ కేసు గురించి కేవీరావుతో మాట్లాడించాన్నారు. ఓ అధికారి ఆదేశాలతోనే తన పేరు ఈ కేసులో ఇరికించినట్లుగా కేవీ రావు చెప్పారన్నారు. విక్రాంత్ రెడ్డిని కేవీరావుకు విక్రాంత్‌రెడ్డిని తాను పరిచయం చేయలేదున్నారు. ఈ విషయాన్నే సీఐడీ అధికారులకు వివరించినట్లు చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు