BRS vs Congress: దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే బీఆర్ఎస్ నేతలకు కడపుమంటగా ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణకు వచ్చిన పెట్టుబడులను కేటీఆర్, హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు మంట తగ్గించుకోవాలని నిన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు నేతలు కేసీఆర్, కేటీఆర్‌లకు ఈనో ప్యాకెట్లను పంపారు. అంతేకాదు ఈ విషయంలో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు కూడా వెలిశాయి. దావోస్‌లో రికార్డు స్థాయిలో రూ.1.78 కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO.. ENO on కడుపుమంట Gone అంటూ హోర్డింగులు ఏర్పాటు చేయడం చర్చనీయంశంగా మారింది.
ఇది కూడా చూడండి: కరీంనగర్ లో అఘోరీ హల్ చల్
పెట్టుబడులు చూసి కడుపు మంటా?
ఇదిలా ఉండగా తాజాగా దావోస్(Davos) పెట్టుబడులపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) కూడా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్(Mettu Sai Kumar) గాంధీభవన్(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్(BRS) నేతలు జీర్ణశక్తి పెంచుకోవడం కోసం సిరప్, టాబ్లెట్స్ పంపుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్, హరీశ్‌రావుల అడ్రస్ రాసిన కవర్లను కొరియర్ చేస్తున్నామని ఆయన సెటర్లు వేశారు. అంటూ మందులు పంపిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: సన్యాసిగా మారిన బాలీవుడ్ నటి.. బాధలో ఫ్యాన్స్
పెట్టుబడులు చూసి బీఆర్ఎస్ నాయకులకు జీర్ణకోశ వ్యాధి వచ్చే అవకాశం ఉందని, కాబట్టి వారి ఆరోగ్య పరిస్థితుల దృష్టా వారికి మెడిసిన్స్ పంపుతున్నామన్నారు. ఈ మెడిసిన్స్ మూడు పూటల వాడాలని వ్యంగంగా అన్నారు.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?
ఇది కూడా చూడండి: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!