/rtv/media/media_files/2025/02/26/j1tbvlzWy3p6O7p9BiVO.jpg)
Prashanth Kishore
ప్రముఖ మాజీ రాజకీయ వ్యూహకర్త, జన్‌సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ చెన్నై టీమ్‌ను గెలిపించినట్లు తాను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. విజయ్ పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. తమిళనాడులోని మహబలిపురంలో టీవీకే మొదటి వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న పీకే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Also Read : నెల పాటు అల్పాహారం తీసుకోకపోతే ఏమవుతుంది?
Prashanth Kishore About Tamil Nadu Politics
Dhoni will make csk win
— ManaTeluguPrajalu (@MTPrajalu) February 26, 2025
I will make TVK win - Prashanth kishore #TVKVijay #PrashantKishor #Dhoni #TamilNadu #csk #vijay #TVKFirstAnniversary #TVK pic.twitter.com/ODtu0goi8J
Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం
ఇదిలాఉండగా.. తమిళనాడులో గత అసెంబ్లీ డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త పనికి స్వస్థి పలికి సొంతగా జన్‌సూరజ్ పార్టీని స్థాపించారు. కానీ తనను స్వయంగా సంప్రదించే నేతలకు మాత్రం పీకే సలహాలు ఇస్తున్నారు. అయితే తాజాగా టీవీకే వార్షికోత్సవ వేడుకల్లో పీకే పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపిస్తానని చెప్పడం చర్చనీయమవుతోంది. అయితే ఐ ప్యాక్ సంస్థ ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేతల్లో లేదు. దీంతో ఐ ప్యాక్ తరఫున కాకుండా వ్యక్తిగతంగానే పీకే విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది.
Also Read: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
అయితే విజయ్ (Vijay) తన రాజకీయ పార్టీని ప్రకటించిన అనంతరం అన్నాడీఎంకేపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కేవలం డీఎంకే పార్టీనే టార్గెట్ చేశారు. అన్నా డీఎంకేతో పొత్తుకి సంబంధించి విజయ్ వ్యూహాత్మకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. జయలలిత అభిమానులు తనవైపు ఉండే టీవీకే విజయం సాధిస్తుందని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే మరింత బలం చేకూరుతుందనే ప్రచారం నడుస్తోంది.
Also Read : అంతు చిక్కని వ్యాధి.. ఈ వైరస్ సోకితే 48 గంటల్లో మరణమే!