8th Pay: కేంద్ర ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు

కేంద్ర ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు ఓకే చెప్పింది. దీంతో కోటి పదిహేను లక్షల మంది ఉద్యోగుల, పింఛనదారుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి. 

author-image
By Manogna alamuru
New Update
central

8th pay commission

8వ వేతన పే కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని...దానికి ప్రధాని మోదీ (PM Modi) ఆమోదముద్ర వేశారని కేంద్ర ప్రచార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) నిన్న ప్రకటించారు. దీని వలన కోటీ పదిహేను లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. దీంతో ఉద్యోగులకు జీతాలు పెరగడమే కాకుండా పెన్షన్లు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం 7వ వేతన సవరణ సంఘం నడుస్తోంది. దీని కాలపరిమితి 2026తో ముగుస్తోంది. అందుకే 8వ వేతన సవరణ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వేతన సవరణకు సంబంధించి కమిషన్ ఛైర్ పర్శన్, ఇద్దరు సభ్యలు పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 8వ వేతన సవరణ 7వది ముగిసాకనే అమల్లోకి వస్తుంది. దీనికి ఏడాదికి పైగా సమయం ఉంది కాబట్టి ఈలోపు సంఘం భాగస్వాములందరితో విస్తృత చర్చలు జరుపుతామని చెప్పారు. 

Also Read: AP Govt Jobs 2025: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త.. 26,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు...

ఇక 8వ వేతన సవరణకు సంబంధించిన అధికారిక ప్రకటన ఫిబ్రవరి 1, 2025 ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో ఉంటుందని అనుకున్నారు...కానీ దానికన్నా ముందే కేంద్ర దీని గురించి శుభవార్త చెప్పింది. అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగులకు జీతాలు భారీగా పెరుగుతాయి. మరోవైపు కొత్త వేతన సవరణ అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగులకు జీతాలు భారీగా పెరుగుతాయి. ఉద్యోగుల కనీస వేతనం రూ.34 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కనీస పెన్షన్ సైతం రూ.17 వేలపైన అందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 7వ వేతన సవరణలో బాండ్స్, గ్రేడ్ పే స్థానంలో సింప్లిఫైడ్ పై మ్యాట్రిక్ అమల్లోకి తీసుకుని వచ్చారు. కనీస జీతం 18 వేలు చేశారు. బేసిక్ పే పైన 2.57 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇస్తున్నారు. గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. ఇక ద్రవ్యోల్బణం ఇండెక్స్ ఆధారంగా డీఏ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం డీఏ 53 శాతంగా ఉంది. దీని ప్రకారం లెక్కలు వేస్తే 8వ వేతన సవరణలో ఉద్యోగులకు భారీగా లాభం చేకూరనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు