BIG SHOCK TO TRISHA : త్రిషకు విజయ్‌ బిగ్‌షాక్..తిరుచ్చి ఈస్ట్‌ నుంచి నో టికెట్!

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు, TVK (తమిళగ వెట్రి కళగం) అధినేత విజయ్, తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఇటు సినీ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నటి త్రిషకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని సర్వత్రా ప్రచారం సాగుతోంది.

New Update
Vijay Trisha

Vijay Trisha

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు, TVK (తమిళగ వెట్రి కళగం) అధినేత విజయ్(TN CM TVK Vijay), తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఇటు సినీ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నటి త్రిషకు ఆయన 'షాక్' ఇచ్చారంటూ ప్రచారం సాగుతోంది. దీనికి కారణం ఆయన రాజీనామా చేయనున్న తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని(trichy east constituency) త్రిష(actress-trisha) కు ఇస్తారని మొదట ప్రచారం సాగింది. అయితే త్రిష స్థానంలో మాజీ IAS సగాయంకు టికెట్‌ కేటాయిస్తారని తెలుస్తోంది.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ అనూహ్య ఫలితాలను సాధించింది.మొత్తం 234 స్థానాలకు గాను TVK 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్.. రెండు చోట్లా ఘనవిజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు చోట్ల గెలిస్తే, ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకుని, పెరంబూర్ స్థానాన్ని అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Also Read :  అటో డ్రైవర్ అంటూ గెలిచి.. 2 రోజుల్లోనే బుద్ధి చూపెట్టిన TVK ఎమ్మెల్యే.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు!

BIG SHOCK TO TRISHA

విజయ్ రాజీనామా చేయనున్న తిరుచ్చి ఈస్ట్ స్థానం నుండి ఆయన అత్యంత సన్నిహితురాలు, నటి త్రిష(Actor Trisha) పోటీ చేస్తారని, ఆమె గెలిస్తే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి కూడా ఇస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. అయితే, తాజా పరిణామాలు మరోలా ఉన్నాయి. అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా, అత్యంత నిజాయితీ గల అధికారిగా పేరున్న మాజీ IAS అధికారి యు. సగాయంను ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని విజయ్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో పాలనాపరమైన అనుభవం ఉన్న వ్యక్తులు అవసరమని విజయ్ భావిస్తున్నారు. సగాయంకు ఉన్న ప్రజాదరణ ,ఆయన క్లీన్ ఇమేజ్ పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

త్రిషకు టికెట్ దక్కలేదన్న వార్త ఆమె అభిమానులకు షాక్ ఇచ్చినప్పటికీ, దీనిపై పార్టీ నుండి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఒకవేళ సగాయంను బరిలోకి దింపితే, త్రిషను పార్టీలో మరో కీలక పదవికి లేదా రాజ్యసభకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది.మెజారిటీ మార్కు (118) కు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన TVK, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇతర చిన్న పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోరుతోంది.కాంగ్రెస్, VCK వంటి పార్టీలతో విజయ్ చర్చలు జరుపుతున్నారు.

దశాబ్దాలుగా సాగుతున్న DMK, AIADMK ద్వంద్వ రాజకీయాలకు విజయ్ గట్టి దెబ్బ కొట్టారు.మొత్తానికి, తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎవరనేది విజయ్ మార్క్ పాలిటిక్స్‌కు ఒక నిదర్శనంగా మారనుంది. త్రిషకు నిజంగానే హ్యాండ్ ఇచ్చారా లేక ఆమెకు మరో కీలక బాధ్యత ఇస్తారా అన్నది వేచి చూడాలి.

Also Read :  టీవీకే పార్టీ సంచలన రికార్డ్.. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు సేఫ్

Advertisment
తాజా కథనాలు