/rtv/media/media_files/2025/03/05/wK9nqPPA2s6dyrdR2kXF.jpg)
Leopard attack mother and daughter
Tiger Attack: ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక చిరుతపులి రాత్రి ఇంట్లోకి ప్రవేశించి తల్లీకూతురిపై దాడి చేసింది. ఆ దాడి సమయంలో వారి పెంపుడు కుక్క వారికి రక్షణగా నిలిచింది. ఆ కుక్క దాదాపు 30 నిమిషాల పాటు చిరుతపులితో తీవ్రంగా పోరాడి ఇంట్లోనుంచి తరిమికొట్టగలిగింది. దీంతో తల్లీకూతురు ప్రాణాలతో బయటపడగా సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి..
మార్చి 5 రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. త్రిలోక్ చంద్ర పాండే ఇంట్లో అతని భార్య 45 ఏళ్ల కమలా దేవి, 15 ఏళ్ల కూతురు విజయ వంటగదిలో ఉన్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఒక చిరుతపులి పిల్ల ఇంట్లోకి ప్రవేశించి వారిపై దాడి చేసింది. కమలా దేవి ధైర్యం చూపించి తన కూతురిని వెనక్కి నెట్టింది. అక్కడినుంచి పారిపోతుండగా ఇద్దరూ కిందపడిపోయారు. దీంతో కమలా దేవి దవడ విరిగింది. విజయకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే చిరుతపులి దాడిని చూసిన ఆ కుటుంబం పెంపుడు కుక్క వారిని కాపాడింది. చిరుతపులిని తీవ్రంగా కొరికింది. అరగంట పాటు రెండింటి మధ్య పోరాటం జరిగింది. చివరికి కుక్క దాడిలో వంటగదిలో స్టవ్‌ను బలంగా ఢీకొని చిరుతపులి గాయపడింది.
Also read : దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!
బయటకు వెళ్లాలంటే భయం..
ఈ విషయం గ్రామస్తులకు తెలియగానే అటవీ శాఖకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజర్ శ్యామ్ సింగ్ కారాయత్ నేతృత్వంలోని రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి పట్టుకుంది. కుక్క కాటు కారణంగా చిరుతపులికి అనేక తీవ్ర గాయాలు అయినట్లు రేంజర్ తెలిపారు. చిరుతపులిని బోనులో బంధించి తీసుకెళ్లారు. చిరుతపులి దాడిలో గాయపడిన కమలా దేవి, విజయలను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సరైన చికిత్స లేకపోవడంతో వారికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తిరిగి పంపించారు. ఇక ఈ ప్రాంతంలో 12కు పైగా చిరుతలు తిరుగుతున్నాయని, దీని కారణంగా పగటిపూట కూడా బయటకు వెళ్లడం ప్రమాదంగా మారిందని స్థానికుడు త్రిలోక్ చంద్ర పాండే చెప్పారు. బాగేశ్వర్‌లో చిరుతపులి దాడులు పెరుగుతున్నాయని అటవీ శాఖ కూడా అంగీకరించింది. దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Also read : కుంభమేళా వల్ల పడవలు నడిపే వ్యక్తికి రూ. 30 కోట్ల ఆదాయం..యోగి ఆదిత్య నాథ్