/rtv/media/media_files/2025/03/18/jl5B7WiyKflnEC5p0F6J.jpg)
up Dihuli Dalit massacre
Dihuli Dalit massacre: దిహులి ఊచకోత కేసులో 4 దశాబ్దాల తర్వాత మెయిన్‌పురి కోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. 1981 ఉత్తరప్రదేశ్‌లో 24 మంది దళితులను దారుణంగా చంపిన 17 మంది దోషుల్లో ముగ్గురికి మరణశిక్ష విధించింది. 13 మంది మరణించగా, ఒక నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.
24 మంది దళితుల దారుణ హత్య..
ఈ మేరకు 4 దశాబ్దాల క్రితం జరిగిన దిహులి దళిత ఊచకోత కేసులో కోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. మెయిన్‌పురి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి.. కప్తాన్ సింగ్, రామ్ పాల్, రామ్ సేవక్‌లను దోషులుగా నిర్ధారించారు. వారికి మరణశిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించారు. 1981 నవంబర్ 18న సాయంత్రం ఫిరోజాబాద్ జిల్లాలోని దిహులి గ్రామంలోని దళితులపై 17 మంది సాయుధ బందిపోట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 23 మంది అక్కడికక్కడే మరణించగా చికిత్స పొందుతూ 1 వ్యక్తి మరణించాడు. మొత్తం 24 మంది దళితులు దారుణంగా హత్య చేయబడ్డారు.
Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!
ఈ సంఘటన తర్వాత స్థానిక నివాసి లైక్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో ముఠా నాయకులు సంతోష్ సింగ్ (అలియాస్ సంతోష), రాధేశ్యామ్ (అలియాస్ రాధే) సహా 17 మంది నిందితులను అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో 13 మంది నిందితులు మరణించగా ఒక నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. ఈ ఊచకోత తర్వాత అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బాధిత కుటుంబాలను కలిశారు. ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేయడానికి దిహులి నుండి సదుపూర్ (ఫిరోజాబాద్) వరకు కాలినడకన ప్రయాణించారు.
Also Read: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది
4 దశాబ్దాల తర్వాత న్యాయం..
ఈ నిర్ణయంపై ప్రభుత్వ న్యాయవాది రోహిత్ శుక్లా మాట్లాడుతూ.. 'నాలుగు దశాబ్దాల తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఏ నేరస్థుడు చట్టం నుండి తప్పించుకోలేడని సమాజంలో సందేశాన్ని ఇది పంపుతుంది' అన్నారు. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యాయం సాధించిన విజయంగా బాధిత కుటుంబాలు అభివర్ణించాయి. అయితే ఈ తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.