/rtv/media/media_files/2025/02/18/aR709gb0Kaui4V8rQPHO.jpg)
UPSC
UPSC CSE 2025: సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి యూపీఎస్సీ పొడిగించింది. ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అఖిల భారత సర్వీసుల్లో 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) పరీక్షకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 22న దరఖాస్తుల ప్రక్రియ మొదలుకాగా ఫిబ్రవరి 11తో ముగిసింది. \
Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్ రాయల్ సంచలన ఆడియో!
ఆ తర్వాత అధికారులు ఈ గడువును ఫిబ్రవరి 18 వరకు పొడిగించారు. ఈ గడువు నేటితో మగియగా.. మరోసారి ఫిబ్రవరి 21 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్సీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫిబ్రవరి 22 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉన్న కూడా వాటిని ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు సవరించుకునే ఛాన్స్ ఉన్నట్లు యూపీఎస్సీ తెలిపింది.
Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్
ఇదిలాఉండగా..
మరోవైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో మొత్తం 150 పోస్టులకు కూడా దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 21వరకు పొడిగించారు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఆగకుండా ముందుగానే దరఖాస్తుల చేసుకోవాలని యూపీఎస్సీ సూచనలు చేసింది.
Also Read: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్ టెస్టులు ఫ్రీ
Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్