/rtv/media/media_files/2025/01/14/Y4Tb3bLy8oBSxVXeF08c.jpg)
Dharmapuri Arvind and Piyush Goyal
Turmeric Board: గత కొన్నేళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న నిజామాబాద్(Nizamabad) రైతుల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీ మేరకు జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. మంగళవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఉన్నారు.
Also Read: మోదీ కేబినెట్‌లోకి మెగాస్టార్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే!
తెలంగాణలో 2023 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అక్టోబర్ 21న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఓ సభలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్యశాఖ పసుపు బోర్డు ఏర్పాటుపై ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కానీ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది అందులో చెప్పలేదు. అయితే తాజాగా నిజామాబాద్‌లోనే జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని నియమించింది.
Also Read: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు
పసుపు బోర్డు(Turmeric Board) ప్రయోజనాలు
పసుపు బోర్డు వల్ల పసుపును పండించే రైతులకు చాలావరకు మేలు కలుగుతుంది. కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హర్వెస్ట్ మేనేజ్‌మెంట్, మార్కెట్ వరకు రైతులకు లబ్ధి ఉంటుంది. ఈ పంటకు మద్దతు ధర ఎక్కువగా వస్తుంది. అలాగే పసుపు తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం లాంటివి చేసేందుకు అవసరమైన యంత్రాలకు ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహాకారం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ప్రతీ సీజన్‌లో మొత్తం 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది.
Also Read: ఓ వైపు కార్చిచ్చు..మరో వైపు చుక్కలనంటుతున్న అద్దెలు..ఇంకో పక్క
Also Read : తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే?