/rtv/media/media_files/2025/04/04/QSDHaddMFZV92YaMtDxC.jpg)
up
UP:ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కోర్టులో సినిమా తరహాలో ఫైటింగ్ జరిగింది. కోర్టు హాల్‌లో ఇద్దరు మహిళలు.. మగ లాయర్‌ను పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Also Read: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
బస్తీ సివిల్ కోర్టు హాల్ నుంచి ఒక లాయర్ బయటకొస్తున్నాడు. ఇంతలో మహిళలు అడ్డగించి భౌతికదాడికి దిగారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏప్రిల్ 3న (గురువారం) ఈ ఘటన చోటుచేసుకుంది. లాయర్ కూడా అంతే ధీటుగా మహిళలపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న మిగతా లాయర్లంతా జోక్యం పుచ్చుకుని విడదీశారు.
Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!
Womens Attack On Lawyer
📍 बस्ती: अधिवक्ता को देर रात महिला को फोन करना पड़ा भारी 📞
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) April 3, 2025
💥 सिविल बार पहुंचकर दोनों महिलाओं ने जमकर पीटा
🎭 हाई वोल्टेज ड्रामा देख बीच बराव कराने पहुंचे अधिवक्ता
👩⚖️ हमलावर महिलाओं द्वारा वकील को दी गई गालियां
📍 एसपी ऑफिस के पास सिविल बार का पूरा मामला#Basti… pic.twitter.com/K8BxdmCtsQ
ఫోన్‌లో లాయర్ దుర్భాషలాడినట్లుగా ఒక మహిళ ఆరోపించింది. అతనితో మాట్లాడేందుకు వచ్చి గొడవకు దిగారు. అనంతరం కొట్లాటకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
ఇద్దరు మహిళలపై న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మహిళలపై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ కూడా పోలీసులను డిమాండ్ చేశారు. న్యాయవాదులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read: Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
lawyer | court | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | today-news-in-telugu | uttar-pradesh