prayagraz: ప్రయాగ్‌రాజ్ టు అయోధ్య ప్రయాణం కేవలం 24 గంటలే!

మహా కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసిన తరువాత భక్తులు అటు నుంచి అటు అయోధ్య రామాలయానికి వెళ్తున్నారు.దీంతో ప్రయాగ్‌రాజ్‌ -అయోధ్య రహదారి పై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 4 గంటల ప్రయాణానికి 24 గంటలు పడుతుందని భక్తులు చెబుతున్నారు.

author-image
By Bhavana
New Update
kumbhtraffic

kumbhtraffic

 

మహా కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసిన తరువాత భక్తులు అటు నుంచి అటు అయోధ్య రామాలయానికి వెళ్తున్నారు.దీంతో ప్రయాగ్‌రాజ్‌ -అయోధ్య రహదారి పై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సాధారణ రోజుల్లో 4 గంటల సమయం పట్టే ఈ మార్గంలో వాహనాలు భారీగా రోడ్డెక్కడంతో 24 గంటలకు పైగా పడుతున్నట్లు తెలుస్తుంది. ట్రాఫిక్‌ లో చిక్కుకొని వృద్దులు, చిన్నారులతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

Also Read:AP New Virus: బిగ్‌ వార్నింగ్‌.. ఏపీలో కొత్త వైరస్...బీ అలర్ట్!

మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు ఉత్తర్‌ ప్రదేశ్ లోని ప్రయాగ్‌ రాజ్‌ కు తరలి వస్తున్నారు. ఇప్పటికే ఈ కుంభమేళా మొదలై ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్‌ రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ లే కనపడుతున్నాయి.

Also Read: Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్‌ అంగీకారం!

గంటల పాటు యాత్రికులు వాహనాల్లోనే ఉండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్‌ లోనే వేలాది వాహనాలను ఆపేస్తున్నారు.యూపీ అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని ముందుకు అనుమతిస్తున్నట్లు తెలుస్తుంది.

కుంభమేళాకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్‌ రాజ్‌ దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాగ్ రాజ్‌-కాన్పూర్‌,ప్రయాగ్‌రాజ్‌-లఖ్‌నవూ ప్రతాప్‌గడ్‌,ప్రయాగ్‌రాజ్‌-వారణాసి,మిర్జాపూర్‌, ప్రయాగ్‌రాజ్‌-రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో మూడు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతుంది.

సుమారు 48 గంటల పాటు ట్రాఫిక్‌ లోనే చిక్కుకున్నట్లు అనేక మంది ప్రయాణికులు చెబుతున్నారు. 50 కిలోమీటర్ల మేర దూరానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రయాగ్‌ రాజ్‌కు వెళ్తున్న వాహనాల రద్దీ దృష్ట్యా ..ఆదివారం నాడుమధ్య ప్రదేశ్‌ పరిధిలోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్‌ ను ఎక్కడికక్కడే నిలిపేశారు. 

రాష్ట్రంలోని కటనీ,మైహర్,రివా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.సోమవారం వరకు ట్రాఫిక్‌ ను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నామని సురక్షిత ప్రాంతాలు చూసుకోవాలని కటనీ జిల్లా పోలీసులు ప్రకటించారు.రేవా-ప్రయాగ్‌ రాజ్‌ రహదారిలో వాహనాలు ముందుకు వెళ్లే ప్రసక్తి లేదని జిల్లా పోలీసులు పేర్కొన్నారు.


చాక్‌ఘాట్‌ తర్వాత విపరీతంగా రద్దీ ఉందని,దాంతో వాహనాలు నిలిపివేశామని రివా జిల్లా కలెక్టర్‌ ప్రతిభా పాల్‌ వెల్లడించారు.ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికోసం తాత్కాలిక వసతి , నీరు, ఆహారం అందించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 42 కోట్ల మందికి పైగా ప్రయాగ్‌ రాజ్‌ను దర్శించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:Bharat: భారత్ కు యుద్ధ విమానాలు: ట్రంప్‌!

Also Read: Mohan Babu : రెచ్చిపోయిన మోహన్‌బాబు బౌన్సర్లు.. తిరుపతిలో రౌడీయిజం .. ఏం చేశారంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు