/rtv/media/media_files/2026/04/16/lok-sabha-2026-04-16-07-04-58.jpg)
Lok sabha
దేశ చరిత్రలో గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా మూడు కీలక బిల్లులు గురువారం లోక్‌సభ(lok-sabha) ముందుకు రానున్నాయి. ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో డీలిమిటేషన్(delimitation) చేపట్టే 131 రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కావాల్సిన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన అవసరమైన బిల్లు.. ఈ మూడు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.
Also Read: డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత..జనాభా ప్రాతిపదిక ఒక్కటే కాదు...
Three Major Bills In Lok Sabha
ఈ మూడు బిల్లులపై ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చించనున్నారు. వీటిలో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా.. మిగతా రెండు చట్టపరమైన బిల్లులు ఉన్నాయి. అయితే డీలిమిటేషన్‌కు సంబంధించి రాజ్యంగ సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ కావాల్సి ఉంటుంది.
రాజ్యాంగ సవరణ బిల్లు సభలో ఆమోదం పొందాలంటే రెండొంతుల (2/3) మెజార్టీ ఉండాలి. ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. బిల్లు ఆమోదానికి 360 ఓట్లు అవసరం. NDA కూటమికి 292 మంది బలం ఉంది. అయితే మరో 68 ఓట్ల కోసం కేంద్రం ఇతర పార్టీలపై ఆధారపడాల్సి ఉంది. విపక్ష సభ్యులు ఒకవేళ గైర్హాజరైతే 'ప్రెజెంట్ అండ్ ఓటింగ్' ప్రతిపాదికన అధికార పక్షానికి కలిసొచ్చే ఛాన్స్ ఉంటుంది.
Follow Us