/rtv/media/media_files/2025/02/02/PvUwQ0GhLIBaGTkSb9hq.jpg)
R.G.kar Hospital
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్యాచారం ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీనిపై తాజాగా సీబీఐ హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఇందులో జూనియర్ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదని చెప్పింది. ఒక్క నేరస్థుడి ప్రమేయం మాత్రమే ఉందని తెలిపింది.
నిందితుడికి జీవిత ఖైదు..
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారిస్తోంది.ఈ కేసులో సీబీఐ మరోసారి విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కొద్దిరోజుల క్రితం దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. కోల్‌కతా హైకోర్టులో ఈ పిటిషన్‌ను కొనసాగించవచ్చని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచనలు చేశారు.
కేసు వివరాల్లోకి వెళ్తే.. 2024, ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్.. ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉంది. బాధితురాలు భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్‌మెంట్ సెమినార్ హాల్‌కు వెళ్లింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలచివేసింది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్‌కు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు అతడికి ఉరిశిక్ష వేయాలంటూ పలువురు డిమాండ్లు చేశారు. కానీ కోర్టు ఇది అసాధారణ కేసు కాదని పేర్కొంటూ ట్రయల్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
today-latest-news-in-telugu | kolkata | rape-case | high-court | cbi
Also Read: Mynmar Earth Quake: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి