West Bengal CM: పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరు ?.. నేడు బీజేపీ కీలక నిర్ణయం!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో  బీజేపీ మొదటి సారిగా ఘన విజయం సాధించడంతో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ముగిసింది. దీంతో బెంగాల్ సీఎం ఎవరూ అనేది నేడు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం తేల్చనుంది.

author-image
By B Aravind
New Update
Who is West bengal CM

West Bengal CM

West Bengal CM: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో  బీజేపీ మొదటి సారిగా ఘన విజయం సాధించడంతో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి "బెంగాల్ తదుపరి సీఎం ఎవరు?"  అనేది నేడు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం తేల్చనుంది. ఎప్పట్లాగే సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచింది. దీంతో సీఎం అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా మే 9వ తేదీన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది.అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఢిల్లీ నుంచి కోల్‌కతా దాకా రాజకీయ వేడి రాజుకుంది.

Also Read: శాసనసభా పక్ష నేతగా విజయ్‌ ఏకగ్రీవ ఎన్నిక.. సీఎంగా ప్రమాణ స్వీకారం అప్పుడే !

సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సువేందు అధికారి. ఆయన మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో 15 వేల ఓట్ల తేడాతో ఓడించడంతో ఆయనపై పార్టీలో భారీ అంచనాలు ఉన్నాయి. అమిత్ షా సూచన మేరకు నందిగ్రామ్, భవానీపూర్ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసి గెలవడం సువేందు అధికారి రాజకీయ బలాన్ని నిరూపించింది. మమతా బెనర్జీని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సవేందు అధికారి ఓడించారు. దీంతో రెండుసార్లు వరుసగా దీదీని దెబ్బతీసిన నాయకుడిగా, అలాగే క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నేతగా సువేందు గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో అధిష్టానం ఈయన వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే పార్టీని బలోపేతానికి కృషి చేసిన మరో నేత సమీక్ భట్టాచార్య పేరు కూడా సీఎం రేసులో బలంగా వినిపిస్తోంది. మంచి విద్యావంతుడిగా, బెంగాలీ సంస్కృతిపై అపారమైన అవగాహన ఉన్న నాయకుడిగా ఈయనకు గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బెంగాల్‌లో పాత, కొత్త కార్యకర్తలను సమన్వయం చేస్తూ BJPని గెలిపించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. దీంతో ఈయనకు కూడా సీఎం పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఉత్తరప్రదేశ్ తరహాలో పశ్చిమ బెంగాల్‌లో కూడా ఆధ్యాత్మిక వేత్తకు అధికారం అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఉత్పాళ్ బ్రహ్మచారో (ఉత్పాళ్ మహారాజ్) పేరు వినిపిస్తోంది. కాళిగంజ్ నియోజకవర్గం నుంచి ఈయన 76,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అంతేకాదు తన సామాజిక సేవ ద్వారా హిందూ ఓట్లను ఏకీకృతం చేయడంలో సఫలమయ్యారు. RSS ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తిగా ఆయనకు ఇమేజ్ ఉంది. దీంతో యోగి ఆదిత్యనాథ్ తరహాలో ఈయనకు కూడా ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read: ప్రశాంత్ కిషోర్ టీం నుంచి బయటకు వచ్చి.. విజయ్ ను గెలిపించిన కపిల్ సాహు ట్రాక్ రికార్డ్ ఇదే!

వీళ్లతో పాటు ప్రసిద్ధ మేధావి, రచయిత స్వపన్ దాస్‌గుప్తా, ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ పేర్లు కూడా సీఎం పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా "బెంగాల్ బిడ్డ" మాత్రమే సీఎం కావాలని గతంలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. దీంతో బయటి వ్యక్తుల కన్నా స్థానిక నాయకత్వానికే పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో జరగనున్న బీజేపీ శాసనసభా పక్ష మీటింగ్ అనంతరం ఈ ఉత్కంఠకు తెరపడనుంది. RSS తుది నిర్ణయం కూడా సీఎం ఎంపికలో కీలకం కానుంది. దీంతో బెంగాల్‌లో సీఎం పదవి ఎవరికి వస్తుందో అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. 

Advertisment
తాజా కథనాలు