/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం(road accident) జరిగింది. ఈ ఘటనలో నలుగురు పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. జలోరి పాస్ సందర్శన ముగించుకుని భూంతర్ వైపు ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ ఒక్కసారిగా కంట్రోల్ కోల్పోయి లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో ఆ వాహనంలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also read: 'సినిమా ఇంకా అయిపోలేదు'.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చడ్డా కౌంటర్
Tempo Falls Into Gorge In Himachal Pradesh
సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో వర్షం కురుస్తుండటం, చీకటిగా ఉండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది సవాళ్లు ఎదురయ్యాయి. చివరికి లోయలో పడిపోయిన వాళ్లని బయటకు తీయగా.. నలుగురు అప్పటికే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 18 మందిని సురక్షితంగా రక్షించి పైకి తీసుకువచ్చారు.
Tragic accident in Banjar, Himachal. A traveller van carrying tourists from Delhi and nearby areas fell into a gorge, 3 lives lost, 5 critically injured, 17 rescued out of 20 onboard. Rescue operation by locals and police is ongoing.
— Nikhil saini (@iNikhilsaini) April 4, 2026
Prayers for the lost lives and a speedy… https://t.co/Z6Pbtr4nOFpic.twitter.com/Ml8wphiRg6
Also Read: భారత్ దాడి చేస్తే.. యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాం.. పాక్ మంత్రి బలుపు మాటలు!
వీళ్లలో 14 మందికి గాయాలు కాగా వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితులందరూ బంజర్ పట్టణానికి దగ్గర్లోని ఝీబీలో ఉన్న ఓ హోటల్‌లో బస చేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. అయితే భారీ వర్షాలు కురవడం వల్ల రోడ్డు జారుడుగా మారిందని అందుకే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us