Tech Mahindra: ఖతార్ లో గుజరాత్‌ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

ఖతార్‌లో టెక్ మహీంద్రా సీనియర్ ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్టయ్యారు. గుజరాత్‌కు చెందిన ఆయనను డేటా చౌర్యం కేసులో అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గుప్తా అరెస్టుపై టెక్ మహీంద్రా గ్రూప్ స్పందించింది.

New Update
 Arrest

Arrest

డేటా చోర్యం కేసులో గుజరాత్‌ కు చెందిన టెక్‌ మహీంద్రా సీనియర్‌ ఉద్యోగి అమిత్‌ గుప్తాను ఖతార్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పై తాజాగా మహీంద్రా గ్రూప్‌ స్పందించింది. తమ ఉద్యోగి అమిత్‌ గుప్తాతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపింది ఉద్యోగుల బాగోగులు చూసుకోవడం తమ బాధ్యత అని తెలిపింది.

Also Read: Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

ఈ కష్టసమయంలో వారి కుటుంబానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చింది. ఆయనను విడిపించడానికి ఇరు దేశాల అధికారులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది.ఈ విషయం పై ఇప్పటికే ఖతార్‌ లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అమిత్‌ గుప్తాను విడిపించడానికి అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. దీని పై దర్యాప్తు కొనసాగుతుందని..తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ కేసుకు అసలు కారణం ఏంటనే విషయం ఇంకా తెలియరాలేదు.

Also Read: Horoscope: నేడు ఈ రాశి వారికి పదోన్నతులకు అవకాశం ఉంది..!

బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం..ఆమె కుమారుడు అమిత్‌ గుప్తా ఖతార్‌ లోని టెక్‌ మహీంద్రా కంపెనీలో మేనేజర్‌ గా విధులు నిర్వర్తిస్తున్నారు.డేటా చోర్యం ఆరోపణలతో ఖతార్‌ పోలీసులు అతడిని జనవరి 1 న కస్టడీలోకి తీసుకున్నారు. 48 గంటల పాటు నీరు,ఆహారం ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మూడు నెలలుగా దోహాలో బంధించి ఉంచారు.

తమ కుమారుడు నిర్దోషి అని ..ఎవరో కావాలనే తప్పుడు కేసులో తనను ఇరికించారని ఆమె ఆరోపించారు. సంస్థలో ఎవరో తప్పు చేసి ఉంటే ఖతార్‌-కువైట్‌ రీజియన్‌ హెడ్‌ స్థానంలో ఉన్నందుకు తమ కుమారుడిని అరెస్ట్‌ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం  చేశారు.ఈ విషయాన్ని ఎవరూ తమకు తెలియజేయడానికి కూడా ప్రయత్నించలేదని అన్నారు. గత కొద్ది రోజులుగా తమ కుమారుడు తమతో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి అతడి స్నేహితుడికి కాల్‌ చేయగా ఈ విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే దోహా వెళ్లి ఎంబసీ అధికారులను కలిశానని అయినా లాభం లేకుండా పోయిందని తెలిపారు. తమ కుమారుడిని విడిపించేందుకు సహాయం కోసం వడోదర ఎంపీ హేమాంగ్‌ జోషిని కోరగా..ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత విదేశాంగ అధికారులు మాట్లాడుతూ గుప్తా అరెస్్‌ పై ఖతార్‌ విదేశాంగ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆయనను విడిపించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

Also Read:Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

Also Read: Italy: ఆ ప్రాంతంలో స్థిరపడితే కనుక రూ. 92 లక్షలు మీవే !

qatar | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | tech-mahindra | gujarat | arrest

Advertisment
Advertisment
Advertisment