/rtv/media/media_files/2025/01/15/4pEjZiWOoPFkAYAY5xJX.jpg)
TCS
ఐటీ రంగంలోకి వెళ్లాలనుకొనేవారికి గుడ్‌న్యూస్. ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ ఏడాది 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెన్ అధికారి మిలింద్ లక్కడ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5 వేల తగ్గిందని.. అయినప్పటికీ కూడా ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Also Read: కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా
అయితే టీసీఎస్ ఉద్యోగం పొందాంటే కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోవని.. అభ్యర్థులకు తగిన విద్యార్హతలు కూడా ఉండాలని మిలింద్ తెలిపారు. అలాగే అర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోవని చెప్పారు. ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మరింత మెరుగవుతుందని.. మానవ ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ కూడా తగ్గదని పేర్కొన్నారు.
Also Read: జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం.. !
ఇదిలాఉండగా.. టీసీఎస్ తమ కార్యాకలాపాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను మరింతగా సమకూరుస్తోంది. ఇందుకోసమే ఏఐ సంబంధిత స్కి్ల్స్ ఉన్న అభ్యర్థులను E0 నుంచి E3 స్థాయిల్లో నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఏఐ, కోడింగ్ నైపుణ్యాలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అయితే త్వరలనే 40 వేల ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆ విషయం లేట్ గా చెప్పారు..మస్క్ పై అమెరికా రెగ్యులేటర్ దావా!
Also Read: క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..