/rtv/media/media_files/2026/04/29/tamilnadu-assembly-eletions-2026-04-29-17-18-58.jpg)
Tamilnadu Assembly Eletions
తమిళనాడు(tamilnadu) లో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. 234 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో DMK, AIMDK కూటమిల మధ్యే గట్టి పోటీ ఉంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపించనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ పార్టీలకు అనుకూల, ప్రతికూల అంశాలేంటో ఈ ఆర్టికల్ తెలుసుకుందాం.
Also Read : పశ్చిమ బెంగాల్‌లో రసవత్తరంగా పోలింగ్... మమత. సువేందు అధికారి పోటాపోటీ
డీఎంకే కూటమికి కలిసి వచ్చే అంశాలు
1.స్టాలిన్ స్థాయి నాయకుడు ఇతర పార్టీల్లో లేకపోవడం
2.ఐదేళ్లలో క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం
3.పథకాల అమలులో సానుకూలత
4.ఏకంగా 14 పార్టీలతో పొత్తు.. ఓట్లు చీలకుండా వ్యూహాలు
5.ఎన్నికలకు ముందు పార్లమెంట్ లో వచ్చిన సీట్ల పెంపు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడం
6.విజయ్ పార్టీతో భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే ఛాన్స్ ఉండడం
ఏఐడీఎంకే ప్రతికూలతలు:
1.జయలలిత మృతి తర్వాత ఆ స్థాయి లీడర్ లేకపోవడం
2.పన్నీర్ సెల్వం పార్టీ వీడడం
3.ఓటు బ్యాంకు చెల్లాచెదరు కావడం
4.స్టాలిన్ బీజేపీపై చేసే పోరాటంతో ఎఫెక్ట్ పడడం
5.బీజేపీలో మంచి ఫాలోయంగ్ ఉన్న అన్నామళై ఈ సారి దూరంగా ఉండడం ఆ కూటమికి మైనస్
Also Read : బీజేపీలోకి రాఘవ్ చద్దా.. వెనకుండి చక్రం తిప్పిన ప్రియాంక చోప్రా?
విజయ్ పార్టీ ప్రభావం:
1.మహిళలు, యువతలో సానుకూలత ఉన్నా.. ఓటు బ్యాంకుగా మారడం కష్టమేనన్న చర్చ
2.తరచుగా ప్రచార సభలు రద్దు అవుతుండడంతో నెగటీవ్ సంకేతాలు
3.మార్పు చూపించాలనుకుంటున్న విజయ్, తన పార్టీలో ఎక్కువ మంది డీఎంకే, ఏఐఏడీఎంకేల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చారన్న ఆరోపణ
4.విజయ్ స్వతహాగా క్రైస్తవుడు అయినప్పటికీ ఆ వార్గాన్ని పెద్దగా ఆకట్టులోకేపోవడం
అయితే యువతతో పార్టీకి జోష్
5.నేడు పోలింగ్ కేంద్రాల వద్ద స్పష్టంగా కనిపించిన విజయ్ ఎఫెక్ట్
6.విజయ్ ను పోలిన డ్రస్ (తెల్ల చొక్క, ఖాకీ ప్యాంట్) తో పోలింగ్ స్టేషన్ల వద్ద యువత సందడి, సెల్ఫీలు
7.విజయ్ పార్టీకి సైలెంట్ వేవ్ ఉందంటున్న కొందరు విశ్లేషకులు
Follow Us