/rtv/media/media_files/2025/04/08/0mzQfc9ugjHSx6alGGkp.jpg)
stalin tm Photograph: (stalin tm)
Supreme Court: సుప్రీం కోర్టులో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని న్యాయస్థానం తెలిపింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో పెట్టడం చట్టవిరుద్ధమని తీర్పు వెల్లడించింది. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో ఆలస్యం చేసిన గవర్నర్ ఆర్‌ఎన్ రవికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. కాగా దీనిపై తమిళనాడుతో పాటు రాష్ట్రాలన్నింటికి ఇది భారీ విజయమని సీఎం ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు.
గవర్నర్ చర్య చట్టవిరుద్ధం..
ఈ సందర్భగా తమిళనాడు ప్రభుత్వం వేసి పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలనేది గవర్నర్ చర్య చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇది ఏకపక్షమే అవుతుంది. గవర్నర్ బిల్లును పునఃపరిశీలనకు వెనక్కి పంపిన తర్వాత అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత 2వసారి ఆ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేయకూడదు. అలా చేయడం చట్ట చట్టవిరుద్ధం. అసెంబ్లీలో రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లే పరిగణించాలి. రాష్ట్రపతికి నివేదించాలనుకుంటే నెలరోజుల్లోపే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదనకుంటే 3 నెలల్లోపు బిల్లులపై నిర్ణయం వెల్లడించాలి. అంతేతప్పా శాశ్వతంగా వాటిని తమ వద్ద ఉంచుకోలేరు’ అంటూ స్పష్టం చేసింది.
ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
అసలేం జరిగిందంటే..
శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే పెట్టుకున్నాడని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తూ 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని చెప్పింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలో ఆయన తీరు మారట్లేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజాగా సుప్రీం తీర్పు వెలువరించింది.
ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
tamilnadu | cm-stalin | supreme-court | governer | telugu-news | today telugu news
BIG BREAKING : పాకిస్థాన్ కు సపోర్ట్ .. అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్!
పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని మోదీ, అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన, చేయడానికి ప్రయత్నించిన సహించబోమని సీఎం హిమంత అన్నారు. సదురు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
arrest mla assam
పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన, చేయడానికి ప్రయత్నించిన సహించబోమని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. సదురు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. "నేను వీడియోను చూశాను. ఇది పాకిస్తాన్‌ను సమర్థించే విధంగా పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది. నేను వెంటనే డీజీపీని చర్య తీసుకోవాలని ఆదేశించాను. రాజద్రోహం ఆరోపణలపై ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు" అని సీఎం అన్నారు.
Also Read : హ్యాట్సాఫ్ అనన్య.. ఇది కూడా దేశభక్తే.. మెచ్చుకోకుండా ఉండలేం!
ఈ ఎటాక్స్ వెనుక మోదీ, అమిత్ షా
కాగా 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని.. అందుకే 2019 ఎన్నికల్లో బీజేపీ గెలించిందన్నారు. పుల్వామా దాడి లాగే పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రభుత్వ పాత్ర ఉందనే తాను అనుకుంటున్నానని తెలిపారు. నిజం తేల్చాలని లేకపోతే ఈ ఎటాక్స్ వెనుక మోదీ, అమిత్ షాలు ఉన్నారని నమ్మాల్సి వస్తుందని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అస్సాం పోలీసులు ఆయనపై సుమోటుగా కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు.
Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!
Pahalgam Attack హ్యాట్సాఫ్ అనన్య.. ఇది కూడా దేశభక్తే.. మెచ్చుకోకుండా ఉండలేం!
Terror attack: భారత్‌లో కలవనున్న POK.. పాక్ చర్యలకు సరైన సమాధానం అదే!
Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!
Virat Kohli Record: రాజస్థాన్‌తో మ్యాచ్.. కింగ్ కోహ్లీ ముందు భారీ రికార్డు- 3 సిక్సులు బాదితే
RCB vs RR : టాస్ గెలిచిన రాజస్థాన్ .. కీలక ఆటగాడు దూరం!