/rtv/media/media_files/2025/01/31/gOwJFcysNrKU00SFvyr3.jpg)
supreme court of india Photograph: (supreme court of india)
పర్యావరణాన్ని కాపాడాల్సిన సమాజం చెట్లను నరుకుతున్నారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక మనిషి చెట్లు నరకడాన్ని దారుణంగా భావించి సంచలన తీర్పునిచ్చింది. అనుమతి లేకుండా చెట్లు నరికితే.. ఒక్కో దానికి రూ.లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఎవరైనా చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఇది కూడా చూడండి: IPL 2025: ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విక్టరీ..
"SC delivers stern message: No mercy for environmental offenders! ₹1 lakh fine per illegally cut tree approved as a deterrent. Justice prevails for the 454 trees cut in protected Taj Trapezium Zone. #EnvironmentalProtection #SupremeCourt pic.twitter.com/UFjJXGcZeM
— DR KAMLESH KALI (@KaliKamlesh) March 26, 2025
ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!
రాత్రికి రాత్రే 454 చెట్లు నరికివేయడంతో..
ఆగ్రాలోని తాజ్ ట్రపెజియం జోన్‌లో శివ శంకర్ అగర్వాల్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఏకంగా 454 చెట్లను నరికేసాడు. దీంతో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. చెట్లను తేలికగా తీసుకోవద్దని, చట్టాన్ని ఉల్లంఘించిన నేరస్థులకు తప్పకుండా కఠిన శిక్ష విధిస్తామని తెలిపింది. శివ శంకర్ అగర్వాల్ అనే వ్యక్తి అనుమతి లేకుండా 454 చెట్లను నరికి వేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇతనికి కోర్టు శిక్ష విధించింది. ఎన్ని చెట్లు అయితే నాటారో అన్ని మొక్కలు నాటాలని తీర్పునిచ్చింది. అలాగే ఒక్కో చెట్టుకు రూ.1 లక్ష జరిమానా కూడా విధించింది.
ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?
యూపీ వృక్ష సంరక్షణ చట్టం 1976 ప్రకారం తప్పకుండా జరిమానా వసూలు చేయాలని కోర్టు అటవీ శాఖను ఆదేశించింది. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1972 ప్రకారం ప్రభుత్వ భూమిలో 32 చెట్లను నరికినందుకు భూ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపింది. పర్యావరణ విషయంలో అసలు దయ చూపకూడదు. చెట్లను నరికివేయడం అనేది మనిషిని చంపడం కంటే దారుణమని స్పష్టం చేసింది. 454 చెట్లు మళ్లీ పెరగాలంటే కనీసం 100 ఏళ్లు పడుతుందని, కనీసం కోర్టు అనుమతి లేకుండా వాటిని నరికేశారు అని ధర్మాసనం తెలిపింది.
ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?
supreme-court | agra | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu