Cattle On Highways : రోడ్ల పైకి వస్తున్న పశువులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి ఆవులు, గేదెలు వస్తుంటాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపైకి కూడా పశువులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

New Update
Supreme Court seeks response from Centre, others on plea to prevent cattle intrusion on highways

Supreme Court seeks response from Centre, others on plea to prevent cattle intrusion on highways

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి ఆవులు, గేదెలు(cattle) వస్తుంటాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపైకి(national-highways) కూడా పశువులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వ్యహారంపై తాజాగా విచారణ చేసింది. నేషనల్ హైవేస్‌ పైకి పశువులు వస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి రోడ్లపై తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని.. దీంతో వాహనాదారులతో పాటు మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

Also Read: పార్టీలో చేరగానే X కేటగిరీ భద్రత.. BJP రాజకీయాల్లో టెన్నిస్ స్టార్ కొత్త ఇన్నింగ్స్!

Supreme Court Seeks Response From Centre

 ఈ మేరకు కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి పశువులు రహదారుపైకి చొరపడే అంశంపై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కోరింది. జాతీయ రహదారుల నుంచి పశువులను దూరంగా ఉంచాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 

Also Read: BSF వినూత్న ఆలోచన.. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోకి మొసళ్లు, పాములు.. ఎందుకో తెలుసా ?

రోడ్లపైకి పశువులు రాకుండా నివారించాలని.. ఇందుకోసం జాతీయ మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలయ్యింది. పశువులతో పాటు ఇతర జంతువులు కూడా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలలో కంచె ఏర్పాటు చేయాలని పిటిషనర్‌ కోరారు. అంతేకాదు పశువుల వల్ల రోడ్డు ప్రమాదానికి గురవుతున్న బాధితులకు పరిహారం చెల్లించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  నాలుగు వారాల్లోగా ఈ అంశంపై తెలియజేయాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. 

Advertisment
తాజా కథనాలు