Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం

దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచి పథకాలు ఇవ్వడం పరిపాటి అయిపోయింది. వీటిపై సుప్రీంకోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్‌లు ఎందుకు తీసుకొస్తున్నాయని నిలదీసింది.

New Update
Supreme Court rebukes states over 'freebie culture'

Supreme Court rebukes states over 'freebie culture'

దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచి పథకాలు ఇవ్వడం పరిపాటి అయిపోయింది. వీటిపై సుప్రీంకోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్‌లు ఎందుకు తీసుకొస్తున్నాయని నిలదీసింది. దేశాభివృద్ధికి అడ్డు తగిలే ఇలాంటి విధానాలను పునఃసమీక్షించుకునే సమయం వచ్చిందని తెలిపింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ డీఎంకే ఫ్రీ కరెంట్‌ ప్రతిపాదన చేసింది. దీనిపై పిటిషన్ దాఖలు కావడంతో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 

Also Read: సముద్ర గర్భంలో ఇంటర్నెట్ విప్లవం.. భారత్-అమెరికాను కలిపే గూగుల్ ‘AIC’ ప్రాజెక్ట్

ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టాలిన్ సర్కార్ రాష్ట్ర ప్రజలందరికీ ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ఉచిత విద్యుత్‌ అందించేలా ఆమోదం తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉచిత స్కీమ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. '' చాలా రాష్ట్రాల్లో ఆర్థిక లోటు పెరుగుతోంది. అయినప్పటికీ ఉచిత పథకాల పంపిణీ కొనసాగుతోంది. ఇలాంటి స్కీమ్‌ల వల్ల దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. ఆహారం, విద్యుత్, ఇలా అన్నింటిని ఫ్రీగా ఇస్తూ పోతే మనం ఎలాంటి అభివృద్ధి చేస్తున్నాం. కరెంట్ బిల్లు చెల్లించే స్థోమత లేనివాళ్లకు ఫ్రీ విద్యుత్ అందిస్తారంటే అర్థం ఉంటుంది. కానీ ఆర్థిక స్థాయిలో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీగా కరెంట్ పంపిణీ చేస్తామంటున్నారు. ఇది బుజ్జగింపు రాజకీయాలు కాదా  ? అంటూ'' సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. 

Also Read: మత విద్వేషానికి మానవత్వం బ్రేక్‌లు.. మొన్న దీపక్, నిన్న కోవాబన్ వలీ

ఎన్నికలను ముందే ఇలాంటి స్కీమ్‌ ఎందుకు తీసుకొస్తున్నారని సుప్రీం ధర్మాసనం మండిపడింది. ఎన్నికలప్పుడు ఇలా అన్ని ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా మిగలదని అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం తమిళనాడు సమస్య మాత్రమే కాదని.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత ఆహారం, విద్యుత్, సైకిళ్లకు బదులు ఉపాధి సృష్టి కోసం చేయాలంటూ సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  

Advertisment
తాజా కథనాలు