/rtv/media/media_files/2025/03/17/BtFi7qUrIJNzVAKpIoKB.jpg)
sunita williams 123 Photograph: (sunita williams 123)
ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్ (International Space Station) నుంచి భూమి మీదకు చేరుకోబోతున్న స్పేస్ ఎక్స్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ (Sunita Williams) కు భారతీయు మూలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆమె అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపిన హ్యోమగామిగా రికార్డ్ సృష్టించారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె తిగిరి 2025 మార్చి 19న అమెరికాకు చేరుకోనున్నారు. ఆమెతోపాటు బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు. వారికి ఘన స్వాగతం పలకడానికి సానా శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. సునీతా తండ్రి ఇండియన్. ఈమె భారతీయ మూలాలున్న వ్యక్తి అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. అనేక సార్లు ఆమె భారతదేశంలో పర్యటించారు కూడా. సునీతా తండ్రి గుజరాత్ నుంచి అమెరికా వెళ్లి అక్కడే సెట్టిల్ అయ్యారు. అమెరికాకు చెందిన మైఖేల్ జె. విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది. ఆయన అమెరికా ఫెడరల్ పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Also read: International Space Station : అక్కడ 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం
Listen to Sunita Williams talking proudly about her Indian heritage, the role of Ganesha and Bhagvad Gita in her life.
— Sharmishta Sharma (@AnObserversView) November 1, 2024
Reminds me of Max Planck, the originator of quantum theory who said:
Both religion and science require a belief in God. For believers, God is in the beginning,… pic.twitter.com/KjxxOIos46
Also Read : చిల్డ్ బీర్ వేసి చిల్ అవుతున్నారు.. సేల్స్ డబుల్!
Sunita Williams Origins Of India
సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా భారత దేశం. ఆయనొక ఇండో అమెరికన్ న్యూరో అనాటమిస్ట్. గుజరాత్‌లో పుట్టి పెరిగిన ఆయన అమెరికాలో న్యూరో అనాటమిస్ట్‌గా సెట్టిల్ అయ్యారు. అక్కడే స్లోవేనియన్ అమెరికన్ ఉర్సులిన్ బోనీ పాండ్యాను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. వీరిలో సునీతా విలియమ్స్ చిన్నది. ఆమెకు జే థామస్ అనే అన్నయ్య. దీనా అన్నద్ అనే అక్క ఉన్నారు. దీనా అన్నద్ ఆమె కంటే మూడేళ్లు పెద్ద. సునీతా విలియమ్స్‌కు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. వ్యాయామం చేయడం, హైకింగ్ చేయడం, కారు డ్రైవింగ్ వంటివి ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సునీతా విలియమ్స్ అమెరికాలోని యూక్లిడ్, ఓహియోలో జన్మించారు. కానీ నీడ్‌హామ్, మసాచుసైట్స్ ఆమె నేటివ్ ప్లేస్‌గా భావిస్తుంటారు.
Also Read : హలో మిస్టర్ చీటర్.. నిన్ను కర్మ వెంటాడుతోంది: హర్షసాయిపై మాజీ లవర్ షాకింగ్ పోస్ట్!