Jagga Reddy : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..వారికే రాజ్యసభ ఇవ్వాలని ప్రతిపాదన

మాజీ ఎమ్మెల్యే,  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల విషయంలో సంచలన ప్రతిపాదన చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఆయన వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ సీట్లు ఇవ్వలని కోరారు.

New Update
FotoJet (6)

Jagga Reddy Proposal to give Rajya Sabha to him

Jagga Reddy :  మాజీ ఎమ్మెల్యే,  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎప్పుడు ఏ పనిచేసినా అది చర్చనీయంశంగానే ఉంటుంది. తాజాగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల విషయంలోనూ ఆయన సంచలన ప్రతిపాదన చేశారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(aicc-president-mallikarjun-kharge) ను ఆయన ఈ రోజు (గురువారం) ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై ఆయన ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. అంతేకాదు ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా మాట్లాడినట్లు తెలిపారు.

Also Read :  బంగారం స్మగ్లింగ్ కేసు.. ఈడీ చార్జిషీట్‌లో రన్యారావు పేరు

Sensational Comments By Jagga Reddy

కాగా, రాజ్యసభ సీట్ల విషయంలో చర్చించడానికే తను ఢిల్లీ వచ్చినట్లు జగ్గారెడ్డి(ex-mla-jaggareddy) స్పష్టం చేశారు. ఇదే విషయంపై రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని కలవడానికి వచ్చానన్నారు. అయితే రాహుల్ గాంధీ(rahulgandi) ముందస్తు షెడ్యూల్ కారణంగా బిజీగా ఉన్నారని అందువల్ల కలవలేకపోయానన్నారు. ఇక అసలు విషయం చెప్తూ  పార్టీనేతలు వి. హనుమంతరావు(V.Hanumantha Rao). జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ సీట్లు ఇచ్చే అవకాశాలపై ఆలోచన చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. జెట్టి కుసుమ కుమార్.. యూత్ కాంగ్రెస్ లీడర్‌గా, స్టూడెంట్ లీడర్‌గా.. కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చారని వివరించారు. జెట్టి కుసుమ కుమార్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్ అని, వాళ్ల కుటుంబం అంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని జగ్గారెడ్డి గుర్తుచేశారు.  అలాంటి వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం సముచితంగా ఉంటుందన్నారు.

ఇక సీనియర్‌ నేత హనుమంతరావు తెలంగాణలో అనేక మంది ముఖ్యమంత్రులతో పని చేశారని వెల్లడించారు. మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని గుర్తు చేశారు. ఆయనకు రాజీవ్ గాంధీ , సోనియాగాంధీ లాంటి అగ్రనేతలు అవకాశాలు ఇచ్చారని తెలిపారు. వి.హనుమంతరావు చురుకైన వ్యక్తి అని, ఆయనకు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని ఖర్గేను కోరానని జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కమిటీలో చర్చిస్తామని ఖర్గే తనకు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే పార్టీ  అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Also Read :  రాజస్థాన్‌లో విషాదం.. 9 ఏళ్ల బాలికకు కార్డియాక్‌ అరెస్ట్‌

Advertisment
తాజా కథనాలు