/rtv/media/media_files/2026/04/03/seema-haider-2026-04-03-16-46-56.jpg)
Seema Haider names son ‘Bharat’, Says, 'Proud to be Hindu in India
పాకిస్థాన్ వలసదారురాలు సీమా హైదర్(seema-haider) గురించి తెలిసిందే. అప్పట్లో ఆమె పబ్‌జీలో పరిచమయమైన సచిన్ అనే భారతీయ యువకుడితో ప్రేమలో పడి భారత్‌కు వచ్చి అతడ్ని పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు పెళ్లై పిల్లలు ఉండటం సంచలనం రేపింది. అయితే ప్రస్తుతం వీళ్లు గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో ఉంటున్నారు. తాజాగా సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఆరో సంతానమైన కొడుకుకు దేశ భక్తిని చాటుకునేలా భరత్ అనే పేరు పెట్టినట్లు సీమా ప్రకటించారు.
Also Read: విజయ్‌కు బిగ్‌షాక్.. నామినేషన్లు చెల్లవా ?.. ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు
మీడియాతో మాట్లాడిన సీమా హైదర్ హిందూ మతం, దేశం పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తపరిచారు. సనాతన ధర్మాన్ని స్వీకరించడం తనకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇచ్చిందన్నారు. ప్రస్తుతం తాను ఒక హిందువుగా గర్వపడుతున్నాని తెలిపారు. 'ఇండియా' అనేది కేవలం పేరు మాత్రమే కాదని..అది ఒక గొప్ప గుర్తింపు అన్నారు. అంతేకాదు క్రికెట్‌లో ఇండియా టీమ్ గెలవాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. తాజాగా తన కొడుకుకి 'భరత్' అనే పేరు పెట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Greater Noida, Uttar Pradesh: Pakistani National Seema Haider, who is married to an Indian, says, "Today is my son’s naming ceremony. There was a vigil last night, and according to Hindu tradition, when a son is born, a naming ceremony is performed. I feel extremely happy and… pic.twitter.com/csOUadvuP3
— IANS (@ians_india) April 2, 2026
భారత్‌లోనే ఉంటాను
మళ్లీ తాను పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని సీమా తేల్చిచెప్పారు. భారత్‌లోనే ఉంటానని.. ఇదే తన శాశ్వత నివాసమని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ వెలకట్టలేనివంటూ కొనియాడారు. అయితే గతంలో తాను ఈ పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదని తెలిపారు. ఈ దేశంలో భద్రంగా, సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశారు.
Also Read: విజయ్‌కు బిగ్‌షాక్.. నామినేషన్లు చెల్లవా ?.. ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు
ఇదిలాఉండగా సచిన్ సీమా దంపతులకు 2025 మార్చిలో కూతురు జన్మించింది. ప్రస్తుతం జన్మించిన బాబు సీమాకు ఆరో సంతానం. సచిన్‌తో ఆమెకు ఇది రెండో సంతానం. అయితే భవిష్యత్తులో ఇక తనకు పిల్లలు వద్దని.. ఆరుగురు పిల్లలు, వారి భవిష్యత్తుపైనే దృష్టి పెట్టినట్లు సీమా తెలిపారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమా తన కొడుకుకు భారత్ అనే పేరు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Follow Us