/rtv/media/media_files/2026/04/06/delhi-assembly-2026-04-06-16-34-50.jpg)
దేశ రాజధానిలోని హైసెక్యురిటీ(security-breach) కలిగిన ఢిల్లీ శాసనసభ(delhi assembly today) ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి మాస్క్ వేసుకొని కారులో వచ్చి అసెంబ్లీ గేట్లను బద్ధలు కొట్టుకుని లోపలికి ప్రవేశించాడు. బడ్జెట్ సమావేశాల వేళ బాంబు బెదిరింపులు వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో పోలీసులు, భద్రతా బలగాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
Also Read : దేశంలో UGC, వన్ నేషన్ - వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
#WATCH | Visuals from Delhi Assembly premises after a car with a Uttar Pradesh registration number forcibly entered Gate No. 2, breaking the iron gate. The driver placed a bouquet there and left. The search for the vehicle is ongoing. pic.twitter.com/KoAgU4I3Q0
— ANI (@ANI) April 6, 2026
సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఒక టాటా సియెర్రా స్పీడ్‌గా అసెంబ్లీ వైపు దూసుకొచ్చింది. అక్కడి భద్రతా సిబ్బందిని ఏమార్చుతూ, గేట్ నంబర్ 2ను బలంగా ఢీకొట్టి ఇనుప కంచెలను పగలగొట్టుకుని ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో విఐపి గేట్ వద్ద CRPF సిబ్బంది మోహరించి ఉన్నప్పటికీ, కారు వేగాన్ని అడ్డుకోలేకపోయారు.
కారును లోపలికి పోనిచ్చిన ఆ ముసుగు వ్యక్తి, నేరుగా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు వెళ్లాడు. అక్కడ వరండా వద్ద కారు ఆపి, ఒక బొకే ఉంచి, ఆపై అంతే వేగంతో కారును వెనక్కి తిప్పి ప్రాంగణం నుండి పారిపోయాడు. ఈ అనూహ్య చర్యతో అక్కడున్న అధికారులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, పోలీసులు ఆ పూలగుత్తిని పరిశీలించారు. అయితే, అందులో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. - viral news telugu
Also Read : BSF వినూత్న ఆలోచన.. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి మొసళ్లు, పాములు.. ఎందుకో తెలుసా ?
పోలీసుల దర్యాప్తు.. ఉద్దేశ్యం ఏంటి?
ఈ ఘటనను ఢిల్లీ పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. "భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఒక కారు లోపలికి రావడం ఆందోళనకరం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది," అని అధికారులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు అసెంబ్లీ పరిసరాల్లోని CCTV ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీ సచివాలయ అధికారులు, పోలీసులు ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశంపై ఆరా తీస్తున్నారు. దేశ రాజధానిలో హై-అలర్ట్ ప్రకటించి, ఆ వాహనం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.
Follow Us