Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయకముందే.. సంచలన నిర్ణయం

ఢిల్లీ CMగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన శీష్‌మహల్‌లో ఉండబోనని ఆమె తేల్చి చెప్పింది. శీష్‌‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు. బంగ్లా నిర్మాణంలో అవినీతి జరిగిందని దానికి శీష్‌ మహల్‌ అని పేరు పెట్టింది BJP.

New Update
sheesh mahal rekha guptha

sheesh mahal rekha guptha Photograph: (sheesh mahal rekha guptha)

బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా గురువారం (ఈరోజు) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఢిల్లీలో వివాదాస్పదంగా మారిన శీష్‌ మహల్‌ గురించి రేఖా గుప్తా స్పందించారు. విలాసవంతమైన బంగ్లా నిర్మాణంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో ఆ భవనానికి శీష్‌ మహల్‌ అని పేరు పెట్టిందే బీజేపీ. ఢిల్లీ సీఎం అధికారిక నివాసమైన శీష్ మహల్‌లో మీరు ఉంటారా అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినత తర్వాత శీష్ మహల్‌గా ఉండనని తేల్చి చెప్పారు రేఖా శర్మ. శీష్‌ మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని ఆమె వెల్లడించారు.

సివిల్‌ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌ బంగ్లా శీష్‌ మహల్‌ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే, గత కేజ్రీవాల్‌ హయాంలో ఆ మహల్‌ తీవ్ర వివాదాస్పదమైంది. విలాసవంతమైన బంగ్లాకోసం కేజ్రీవాల్ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశాడని గతంలో బీజేపీ విమర్శించిన విషయం తెలిసిందే. తనను సీఎం పదవికి ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా రేఖా గుప్తా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధాని ఇచ్చిన హామీలన్నీ నెరెవేర్చనున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

శీష్ మహల్‌కు దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు బీజేపీ ఆరోపించింది. ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్‌లో గోల్డెన్‌ కమోడ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, మినీ బార్‌ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్‌ జరిగిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి  శీష్‌ మహల్‌ అంశం కూడా ఓ ప్రధాన కారణమే.

Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు