J&K: జమ్మూలో అంతుచిక్కని జబ్బు..ఇప్పటి వరకు 15 మంది మృతి

జమ్మూలోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని మరణాలు ఆందోళనకు దారి తీస్తున్నాయి. నెలన్నరలో దాదాపు 5 మంది దాకా చనిపోయారు. డాక్టర్లకు కూడా అర్ధం కాని జబ్బుతో ప్రజలు చనిపోతుండడం అక్కడ ప్రజలను కలవరపడుతోంది. 

New Update
death

Rajouri, Jammu

కేవలం 45 రోజుల్లో 15 మృతి చెందారు. కారణం ఏంటో తెలియడం లేదు. పరీక్షల్లో నిర్ధారణ కావడం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చనిపోతున్నారు. ఇదీ జమ్మూ (Jammu) లోని రాజౌరీ జిల్లాలో పరిస్థితి. అక్కడి డాక్టర్లు కూడా తమకు ఏమీ తెలియడం లేదని చేతులెత్తేస్తున్నారు. తాజాగా మరో చిన్నారి పరిస్థితి సీరియస్ గా ఉంది. పుణె (Pune) లోని వైరాలజీ ఇన్​స్టిట్యూట్, ఢిల్లీ (Delhi) లోని డిసీజ్ కంట్రోల్ సెంటర్ సహా మరో మూడు ల్యాబ్​లలో నమూనాలు టెస్ట్​ చేయగా ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ ఇన్​ఫెక్షన్లు సోకలేదని తేలింది. ప్రస్తుతం ఈ మరణాలు మిస్టీరియస్‌గా మారాయి. దీంతో అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజలు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకోవడానికి 11 మందితో కూడిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. 

Also Read :  లాస్‌ ఏంజెలెస్‌ నుంచి మహేశ్‌ బాబు కోసం హైదరాబాద్ కు ప్రియాంక.. ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్!

Also Read :  ఓరి మీ దుంపలు తెగ..అన్ని కోట్లు ఎలా తాగేశార్రా బాబు!

బంతి భోజనాలపై అనుమానం..

రాజౌరీ జిల్లాల్లో బుధాల్ గ్రామంలో గత నెల ఓ కార్యక్రమంలో బంతి భోజనాలు పెట్టారు. ఆ తరువాత ఇక్కడ భోజనం చేసిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అందులో 5గురు చనిపోయారు కూడా. ఆ తర్వాత అదే చోట మరో బంతి భోజనం కూడా పెట్టారు. ఇది తిన్న తర్వాత మరో ముగ్గురు చనిపోయారు. ఆ తర్వాత 10 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికి మొత్తం 15మంది మరణించారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో భోజనాల వల్లనే చనిపోతున్నారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకే వెంటనే ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ డిపార్ట్​మెంట్, డాక్టర్ల బృందాన్ని బుధాల్ గ్రామానికి పంపించింది. వాళ్లు అక్కడి నీటి నమూనాలను, ఫుడ్ క్వాలిటీని టెస్ట్ చేశారు. గ్రామస్తులందరికీ మెడికల్ టెస్టులు నిర్వహించారు. అయితే అందులో కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇలా ఏ రకంగానూ మరణాలకు కారణాలు తెలియకపోవడంతో రాజౌరీ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. 

Also Read: Breaking News:సైఫ్ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Also Read :  హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు