/rtv/media/media_files/2025/10/16/rahul-gandhi-2025-10-16-14-09-19.jpg)
Rahul Gandhi jabs PM over halt on Russia oil buys claim
అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం(america trade deal with india) పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొందరు కార్పొరేట్ ఫ్రెండ్స్ కోసమే దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ ఒప్పందానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు. మోదీ ట్రంప్ ముందు సరెండర్ అయ్యారని రాహుల్ గాంధీ అన్నారు. గంపగుత్తగా భారత్‌ను ప్రధాని అమెరికాకు అమ్మారని పార్లమెంట్లో ఆయన చెప్పుకొచ్చారు.
Also Read : మాస్ కాపీయింగ్.. 17 మంది టీచర్లపై కేసు
“You have sold India”
— Praveen Chakravarty (@pravchak) February 12, 2026
Watch @RahulGandhi’s fiery & lucid explanation of the India-US trade deal & everything that’s wrong with it
Important to remember - he welcomes trade deals but one that’s a win-win for all
This one, sadly, is not a win for India https://t.co/Xiyuv0E6xfpic.twitter.com/17eufO5M5F
1. స్థానిక పరిశ్రమల పతనం:
అమెరికా నుండి తక్కువ దిగుమతి సుంకంతో వస్తువులు భారత మార్కెట్లోకి వస్తే(India America Relations), దేశీయంగా ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వాటితో పోటీ పడలేక మూతపడతాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశంలో నిరుద్యోగితను మరింత పెంచుతుందని ఆయన హెచ్చరించారు.
2. వ్యవసాయ రంగానికి గండం:
అమెరికా నుండి సబ్సిడీతో కూడిన పాలు, పాల ఉత్పత్తులు (చీజ్, బటర్ వంటివి) వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించడం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమూల్ వంటి సహకార సంస్థలు మరియు కోట్లాది మంది చిన్న పాడి రైతులకు అమెరికా కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడటం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. అమెరికా నుండి సబ్సిడీతో కూడిన పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించడంతో కోట్లాది మంది భారతీయ రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు.
3. డేటా సార్వభౌమాధికారం:
ఈ ఒప్పందంలో భారతీయుల డిజిటల్ డేటా విషయంలో అమెరికా కంపెనీలకు వెసులుబాటు కల్పించడాన్ని రాహుల్ తప్పుబట్టారు. భారతీయ యూజర్ల డేటా విదేశీ సర్వర్లలోకి వెళ్లడం వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు.
4. ఔషధాల ధరల పెరుగుదల:
అమెరికా ఫార్మా కంపెనీల ఒత్తిడికి లొంగి మేధో సంపత్తి హక్కుల నిబంధనలను కఠినతరం చేస్తే, భారత్‌లో లభించే చౌకైన 'జెనరిక్' మందుల లభ్యత తగ్గిపోతుందని, దీనివల్ల సామాన్యులపై చికిత్స భారం పెరుగుతుందని ఆయన వివరించారు.
Also Read : రష్యాలో వాట్సాప్ బ్లాక్.. MAX యాప్‌తో పుతిన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే!
‘మోదీ మిత్రుల కోసమే ఈ ఒప్పందం’
ప్రధాని మోదీ(PM Modi) తన విదేశీ పర్యటనల్లో కుదుర్చుకునే ఒప్పందాలన్నీ దేశం కోసం కాకుండా, ఆయనకు సన్నిహితంగా ఉండే ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల లాభాల కోసమేనని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఈ ఒప్పందం వల్ల లాభపడేది అమెరికా కంపెనీలు మరియు భారతీయ క్రోనీ క్యాపిటలిస్టులే తప్ప, సామాన్య ప్రజలు కాదని ఆయన ధ్వజమెత్తారు.
డిమాండ్:
ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని, పార్లమెంటులో దీనిపై సమగ్ర చర్చ జరగాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.
Follow Us