PM Modi: కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఆర్థిక సాయం

ప్రధాని మోదీ కొత్త పీఎంవో కార్యాలయం సేవాతీర్థ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద బాధితులకు తక్షిణ వైద్యం అందించేలా పీఎం రాహత్‌ అనే స్కీమ్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు.

New Update
PM Modi

PM Modi

ప్రధాని మోదీ(pm modi) కొత్త పీఎంవో కార్యాలయం సేవాతీర్థ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్కీమ్‌లకు ఆమోదం తెలిపారు. ఇందులో రోడ్డు ప్రమాద(Road Accidents) బాధితులకు తక్షిణ వైద్యం అందించేలా పీఎం రాహత్‌ అనే స్కీమ్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించనున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో ఫ్రీగా వైద్యం అందించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.  

Also Read: వెనెజువెలా నుంచి రిలయన్స్‌ చమురు దిగుమతులు.. అమెరికా గ్రీన్‌సిగ్నల్

PM Rahat Scheme

రోడ్డు ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి తీసుకొచ్చాక వైద్యం చేయాల్సి ఉంటుంది. వాళ్ల దగ్గర చికిత్సకు కావాల్సిన సౌకర్యాలు లేకుంటే మరో ఆస్పత్రికి పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ ఆస్పత్రి వాళ్లే రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి. బాధితుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలకు సంబంధించిన బిల్లులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఏడు రోజుల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. 

Also Read: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్ రెహమాన్.. భారత్‌కు లాభమా? నష్టమా ?

ఇదిలాఉండగా లక్‌పతీదీదీల సంఖ్యను కూడా మార్చి 2029 నాటికి రెట్టింపు చేస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటిదాకా ఈ టార్గెట్‌ 3 కోట్లు ఉండగా.. ఇప్పుడు దీన్ని ఆరు కోట్లకు పెంచారు. మరోవైపు స్టార్టప్‌ సిస్టమ్‌ను వేగవంతం చేయడం కోసం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రధాని మోదీ సంతకాలు చేశారు. అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు రూ.2 లక్షల కోట్ల వరకు నిధులు పెంచారు. 

Advertisment
తాజా కథనాలు