DMK Party: తమిళనాడులో ఆ పార్టీకే అధికారం.. ప్రీపోల్‌ సర్వేల్లో వెల్లడి

తమిళనాడులో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలొకంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ప్రీపోల్ సర్వే సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. మళ్లీ డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.

New Update
Pre Polls predict DMK party to return to power in Tamil Nadu

Pre Polls predict DMK party to return to power in Tamil Nadu

తమిళనాడులో మరికొన్నిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu Elections 2026) జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలొకంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ప్రీపోల్ సర్వే సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. మళ్లీ డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విపక్షాల ఓట్ల చీలికల వల్ల DMK(dmk-party) కు భారీ లాభం ఉండనుందని సర్వేలు అంచనా వేశాయి. 

Also Read :  భారత్‌లో మరో ఉగ్రదాడికి ప్లాన్.. వెలుగులోకి సంచలన నిజాలు

లోక్‌పోల్ సర్వే

మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం, స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్ లాంటి స్కీమ్‌లు మహిళలను ఆకట్టుకుంటున్నట్లు సర్వేలు తెలిపాయి. లోక్‌పోల్ సర్వే సంస్థ.. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 మధ్య 1,17,000 మందితో సర్వే నిర్వహించింది.  దీని ప్రకారం.. రాష్ట్రంలోని 234 స్థానాలకు DMK కూటమికి 40.1 శాతం ఓట్లతో 181 నుంచి 189 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.

విపక్ష పార్టీ AIDMK నేతృత్వంలోని NDA కూటమికి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లు గెలుచుకోనుందని తెలిపింది. ఇక మొదటిసారిగా ఎన్నికల్లోకి దిగుతున్న విజయ్‌ నేతృత్వంలోని TVK పార్టీకి 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 సీట్లు సాధించనుందని పేర్కొంది.

Also Read :  KCR బద్దశత్రువుకి MLA టికెట్.. తమిళనాడులో అన్నమలైకు BJP బిగ్ షాక్

పోల్ ట్రాకర్  సర్వే

పోల్ ట్రాకర్ నిర్వహించిన సర్వే కూడా ఈసారి మళ్లీ DMK పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఈ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం DMK కూటమికి 42.7 శాతం ఓట్లతో 172 నుంచి 178 సీట్లు సాధించనుంది. AAIDMK 46 నుంచి 52 సీట్లకే పరిమితం కానుంది. ఇక విజయ్(tvk vijay) నేతృత్వంలోని TVK పార్టీ 19.2 శాతం ఓట్లతో 6 నుంచి 12 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది. నాయకత్వానికి సంబంధించిన విషయంలో ఎడప్పాడి పళనిస్వామి, విజయ్‌లతో పోలిస్తే అనుభవజ్ఞులైన నాయకుడిగా స్టాలిన్‌నే మళ్లీ సీఎం చేయాలని ప్రజలు కోరుతున్నట్లు పోల్‌ట్రాకర్‌ వెల్లడించింది. 

Advertisment
తాజా కథనాలు