PM Modi: ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారు.. ఎప్పుడంటే ?

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఆ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమిస్రీ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.

New Update
Pm Modi To Visit Us From Feb 12 13 First One After Donald Trumps Return To White House

Pm Modi To Visit Us From Feb 12 13 First One After Donald Trumps Return To White House

ప్రధాని మోదీ (PM Modi) అమెరికా పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఆ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమిస్రీ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.  జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలసిందే. ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికాలో నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.  

Also Read: వందే భారత్‌లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. రైల్వేబోర్టు కీలక నిర్ణయం

PM Modi To Visit US

ప్రస్తుతం అమెరికాలో  భారతీయ అక్రమ వలసదారులని అమెరికా వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మోదీ అమెరికా పర్యటన (Modi America Tour) కు వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జనవరి 10-12 తేదీల మధ్య ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కో చైర్‌గా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత అమెరికా బయలుదేరనున్నారు. అయితే జనవరి 27న మోదీ, ట్రంప్ మధ్య ఫోన్‌లో ఇమ్మిగ్రేషన్, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి.  

Also Read: 'అయ్యో బిడ్డా'.. అమెరికాలో తెలుగు స్టూడెంట్ సూసైడ్.. పంపించేస్తారన్న భయంతో..!

ఇదిలాఉండగా.. అమెరికాలో భారతీయ అక్రమ వలసదారులని వెనక్కి పంపిస్తుండటంతో అక్కడ ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండుసార్లు అమెరికా నుంచి భారతీయులను పంపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి మరో 487 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపించనుంది. ఈ విషయంపై ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్‌పై భారత్‌తో చర్చలు జరిపామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 

Also Read: కెనడాలో 20 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్.. వారంతా ఎక్కడ?

ఇటీవల వెనక్కి పంపిన భారతీయులకు సంకెళ్లు వేసి పంపించండం దుమారం రేపింది. దీంతో డిపోర్ట్‌ చేసేవారిని గౌరవంగా పంపాలని భారత్‌ అమెరికాను కోరింది. త్వరలోనే రాష్ట్రాలకు ఈ అంశంపై మార్గదర్శకాలు కూడా జారీ చేయనుంది. ఇప్పటికే ట్రంప్ (Donald Trump) సర్కార్.. 100 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించింది. 

Also Read: పాక్‌ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం

 అమెరికాలోని హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం.. 20, 407 మంది భారతీయుల దగ్గర అమెరికాలో నివసించడానికి కావాల్సిన సరైన డాక్యుమెంట్స్ లేవని గుర్తించారు. అందులో 17,940 మందిని తిరిగి ఇండియా పెంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్భందంలో ఉన్నారు. ఈ క్రమంలోనే దశల వారిగా అక్కడ ఉంటున్న వారిని వెనక్కి పంపిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chhattisgarh : స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

ఛత్తీస్గడ్ లోని గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది స్టూడెంట్స్తో  బలవంతంగా నమాజ్ చేయించిన ఆరోపణలపై  ఏడుగురు టీచర్లపై  పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిలో నలుగురు మాత్రమే ముస్లింలు ఉన్నారని పోలీసు అధికారి చెప్పారు.

New Update
namaz students

namaz students

ఛత్తీస్గడ్ లోని గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది స్టూడెంట్స్తో  బలవంతంగా నమాజ్ చేయించిన ఆరోపణలపై  ఏడుగురు టీచర్లతో సహా ఎనమిది మందిపై  పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  బిలాస్పూర్ జిల్లాలో జరిగిన ఎన్సీసీ క్యాంప్ టీచర్లు ముస్లిమేతర విద్యార్థులతో కొద్ది రోజులపాటు నమాజ్ చేయించినట్లు తెలుస్తోంది. కోటా పోలీస్ స్టేషన్ పరిధిలోని శివతారాయ్ గ్రామంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 1 వరకు జరిగిన ఎన్‌సిసి శిబిరంలో 159 మంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం చేశారని, వారిలో నలుగురు మాత్రమే ముస్లింలు ఉన్నారని పోలీసు అధికారి చెప్పారు.

స్టూడెంట్స్, ప్రజా సంఘాల ఆందోళనతో సంబంధిత టీచర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి బిలాస్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రజనీష్ సింగ్ నగర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కొత్వాలి) అక్షయ్ సబ్దారా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. దర్యాప్తు నివేదికను ఎస్‌ఎస్‌పికి సమర్పించిన తర్వాత శనివారం కేసు నమోదు చేశారు

పలు సెక్షన్ల కింద కేసు

గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉపాధ్యాయులుగా ఉన్న దిలీప్ ఝా, మధులికా సింగ్, జ్యోతి వర్మ, నీరజ్ కుమారి, ప్రశాంత్ వైష్ణవ్, సూర్యభాన్ సింగ్, బసంత్ కుమార్ టీమ్ కోర్ లీడర్-కమ్-స్టూడెంట్ ఆయుష్మాన్ చౌదరిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు (196 (196) (196,1) (196,1), ఛత్తీస్‌గఢ్ మత స్వేచ్ఛ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును కోని పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కోసం కేసు డైరీని కోటా పోలీస్ స్టేషన్‌కు పంపామని ఆయన తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment