PM Modi: పార్లమెంట్ ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ ముచ్చట్లు.. వీడియో వైరల్

శనివారం పార్లమెంట్ ప్రాంగణంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీ.. రాహుల్‌ గాంధీతో కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
PM Modi steps out of car, stops for conversation with Rahul Gandhi in Parliament premises

PM Modi steps out of car, stops for conversation with Rahul Gandhi in Parliament premises

ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ ఎప్పుడూ ఒకరినొకరిపై తీవ్రంగా విమర్శలు చేసుకుంటారు. అయితే శనివారం పార్లమెంట్ ప్రాంగణంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీ.. రాహుల్‌ గాంధీతో కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహాత్మ జ్యోతిబా ఫులే 200వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటు పలువురు కీలక నేతలు పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న ప్రేరణా స్థల్‌కు వచ్చారు.  

Also Read: నడిరోడ్డుపై లాయర్‌ దారుణ హత్య.. ఆ తర్వాత బైక్‌ మొరాయించడంతో?

PM Modi Conversation With Rahul Gandhi

ఆ సమయంలో అక్కడే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభాపక్ష నేత జేపీనడ్డా, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఉన్నారు. కారులో నుంచి దిగిన ప్రధాని అక్కడున్న నేతలను పలకరిస్తూ ముందుకెళ్లారు. మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్‌ గాంధీతో ప్రత్యేకంగా కాసేపు మాట్లాడారు. వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేదానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ కాసేపు ముచ్చటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: రోడ్డుపైనే పరీక్షలు..వైరల్ అవుతున్న బీహార్ ఎగ్జామ్ వీడియో!

Advertisment
తాజా కథనాలు