60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదుల్ని హతం చేశాం: ఇండియన్ ఆర్మీ

జమ్మూకశ్మీర్‌లో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులను హతమార్చామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 2024లో ప్రతి ఐదురోజులకు ఒక ఉగ్రవాదిని.. మొత్తంగా 75 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టామని చెప్పారు. వీళ్లలో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులే ఉన్నట్లు వెల్లడించారు.

New Update
Terrorists and Army

Terrorists and Army

భారత్-పాకిస్థాన్‌సరిహద్దుల్లో తరచుగా దాడులు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఆర్మీ జవాన్లు ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాటం చేస్తుంటారు. అయితే తాజాగా ఆర్మీ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో సుమారు 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులను హతమార్చామని పేర్కొన్నారు. 2024లో ప్రతి ఐదురోజులకు ఒక ఉగ్రవాదిని.. అంటే మొత్తంగా 75 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టామని చెప్పారు. వీళ్లలో అధికంగా 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులే ఉన్నట్లు వెల్లడించారు. 

Also Read: రాబోయే రోజుల్లో AIతో మానవాళికి ముప్పు: గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ

ఆర్మీ అధికారుల నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాలైన ఉధంపూర్, కథువా, దోడా, జమ్మూ, రాజౌరిలో 42 మంది మరణించారు. వీళ్లలో ఎక్కువమంది స్థానికేతర ఉగ్రవాదులు ఉన్నారనే విషయం బయటపడింది. స్థానికేతర కశ్మీర్ లోయలో బారాముల్లా, బందిపొరా, కుల్గాం, కుప్వారా జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. బారాముల్లా జిల్లాలో అత్యధికంగా తొమ్మిది ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ దాడిలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు మరణించారు.    

Also Read: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ

నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో 17 మందిని, జమ్మూకశ్మీర్‌ అంతర్గత ప్రాంతాల్లో 26 మందిని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. మరోవైపు తీవ్రవాద కార్యకలాపాలు పెరగకుండా అడ్డుకునేందుకు భారత భద్రత బలగాలు కీలక పాత్ర పోషించాయి. అయితే జమ్మూకశ్మీర్‌లో ఉన్న స్థానిక ఉగ్రవాదుల సంఖ్య చాలావరకు తగ్గిందని ఓ అధికారి తెలిపారు. కానీ పాకిస్థానీ ఉగ్రవాదులు మాత్రం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇక 2024లో జమ్మూకశ్మీర్‌లో 60 ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బంది, తీవ్రవాదులతో సహా మొత్తం 122 మంది చనిపోయారు.  

Also Read: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం!

Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nitish Kumar: డిప్యూటీ ప్రధానిగా నితీశ్‌ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని బీజేపీ సీనియర్ నేత అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. ఎన్డీయే ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇవ్వాలన్నారు. దీంతో నితీశ్‌ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి.

New Update
Nitish Kumar

Nitish Kumar

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి. దీనికి కారణం బీజేసీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలే. మాజీ కేంద్రమంత్రి అయిన అశ్వినీ కుమార్ చౌబే తాజాగా మీడియాతో మాట్లాడారు.  జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని తెలిపారు. '' NDAకు నితీశ్‌ కుమార్ ఎంతో సేవ చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి ఆయనకు డిప్యూటీ పీఎం పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 

Also Read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

ఇలాంటిది జరిగిదే బీహార్‌ నుంచి ఆ స్థానానికి చేరిన రెండో వ్యక్తిగా నితీశ్‌ కుమార్‌ నిలుస్తారని'' అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. అయితే గతంలో బీహార్‌ నుంచి ఉప ప్రధానమంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ పనిచేశారు.  ఇదిలాఉండగా ఈ ఏడాది చివర్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నీతిశ్ ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా నితీశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సీఎం పదవిపై ఆశతో ఆయన మళ్లీ కూటమి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. 

Also Read: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి

ప్రస్తుతం బీహార్‌ రాజకీయాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉంది. దీంతో ఆ పార్టీ నితీశ్ కుమార్‌ను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నితీశ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదని ఇటీవల ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య బీజేపీ నేత తాను నితిశ్‌ కుమార్‌ను డిప్యూటీ పీఎంగా చూడాలనుకుంటున్నాని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

Advertisment
Advertisment
Advertisment