NTA: నీట్ పరీక్ష తేది షెడ్యూల్ విడుదల..

నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)  ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

New Update
BREAKING

BREAKING

NEET UG 2026: నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్(NEET UG Paper Leak) కావడంతో దీన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)  ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులని అధికారులు తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని.. పాత రిజిస్ట్రేషన్ వివరాలే చెల్లుతాయని స్పష్టం చేశారు. 

Also Read :  Kuldeep Sengar: ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సింగ్‌కు బిగ్‌ షాక్.. ఇక జైల్లోనే

NEET UG 2026 Exam Reschedule

విద్యార్థుల అడ్మిట్ కార్డుల విషయానికొస్తే.. పరీక్షకు 8 నుంచి 10 రోజుల ముందు హాల్ టికెట్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడం వల్ల అభ్యర్థులందరికీ మళ్లీ కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నారు. పరీక్షా కేంద్రాలు, సమయం లాంటి పూర్తి వివరాలు హాల్ టికెట్‌లో ఉంటాయి. అభ్యర్థులు అధికారిక సమాచారం కోసం NTA వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా గమనించాలని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని అధికారులు సూచనలు చేశారు. 

Also Read :  పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు కారణాలేంటో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు