/rtv/media/media_files/2025/04/04/MIzGfBN88EgFk6LZ6Evz.jpg)
lawyer
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లి చేసేటప్పుడు పెద్దలు ఇరుకుటుంబాల ఆరోగ్య,ఆర్థిక, ఆస్తి, స్థితిగతులను తెలుసుకుని వివాహలు చేస్తుంటారు. అయితే ఇటీవలే కోర్టులో ఓ న్యాయవాదికి, న్యాయమూర్తికి మధ్యన జరిగిన వాదన ఆడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!
ఆ వీడియోలో.... వారిద్దరి సంభాషణ ఇలా సాగింది...
న్యాయమూర్తి: “మీకు ఉద్యోగం లేదా?”
వ్యక్తి: “లేదు సార్. నన్ను పిలిచినప్పుడల్లా నేను వెళ్లి డాక్టర్ సర్వీస్ ఇస్తానని చెప్పాను.
న్యాయమూర్తి: “వారు ముందస్తు అనుమతి తీసుకున్నప్పుడు, అది పూర్తిగా తప్పు. మీ ఆదాయం గురించి మీరు ఏం తెలియజేశారు.
Why did you get married without any income? pic.twitter.com/iwqf0K5Sea
— ShoneeKapoor (@ShoneeKapoor) April 1, 2025
వ్యక్తి: “సార్, నాకు ఇప్పుడు ఉద్యోగం లేదని నేను చెప్పాను. నన్ను పిలిచినప్పుడు, నాకు ఉద్యోగం ఉందని రాశాను.”
న్యాయమూర్తి: “మీరు డాక్టర్. ఆదాయం లేకుండా వివాహం చేసుకునే హక్కు న్యాయవాదికి మాత్రమే ఉంది. వైద్యుడికి ఎటువంటి హక్కు లేదు. మీకు ఆదాయం లేకపోతే, మీరు ఎందుకు వివాహం చేసుకున్నారు?”
Also Read: హెల్త్ సూపర్‌వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
ఈ వాదన మధ్యప్రదేశ్ కి చెందిన ప్రముఖ న్యాయమూర్తి వివేక్ అగర్వాల్ కి ఓ డాక్టర్ కి మధ్యన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సంపాదన లేనప్పుడు వెళ్లేందుకు చేసుకున్నారని వివేక్ అగర్వాల్ అడిగిన ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా సంపాదన ఉండాలని రాజ్యంగంలో రాసి ఉందా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తులు, అంతస్తులు, సంపాదన వంటివి చూసి పెళ్లి చేసుకుంటే అందులో వ్యాపారం తప్ప.. ప్రేమ ఎక్కడుంటుందని అంటున్నారు మరికొందరు.
ఇంకొందరు మాత్రం మగాడు సంపాదిస్తినే పెళ్ళికి అర్హుడా..? ఒకవేళ పెళ్ళికి ముందు మంచి ఉద్యోగం లక్షల్లో జీతం ఉండి.. పెళ్లి తర్వాత ఏదైనా కారణాలవల్ల ఉద్యోగం కోల్పోతే విడాకులు ఇచ్చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు. ఈ వాదనలో న్యాయమూర్తి ఎందుకు అలాంటి ప్రశ్నలు అడగాల్సి వచ్చిందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
Also Read: BIG BREAKING: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు!
Also Read: Yuzvendra Chahal - RJ Mahvash: ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!
madhyapradesh | video | audio record | viral | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates