కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో శనివారం ప్రవేశ పెట్టారు. భారీ అంచనాల వేళ నిర్మల తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను సభ ముందు ఉంచారు. రైతులు.. మహిళలకు..ఎంఎస్ఎంఈ లకు కీలక కేటాయింపులు చేసారు. అదే విధంగా బీహార్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు అందాయి. పలు రంగాలకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
Also Read: Summer in Winter: అప్పుడే వేసవి మొదలై పోయిందా..నిన్ననే 35 డిగ్రీలు నమోదు
ఈ బడ్జెట్ లో కేంద్రం త్వరలో ఎన్నికలు జరగునున్న బీహార్ కు మూడు కీలక ప్రాజెక్టులు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతా రామన్ ప్రకటించారు. ఇక సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ కార్డులు ఇస్తున్నట్లు వెల్లడించారు. రూ.10లక్షల విలువైన క్రెడిట్ కార్డులు ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం 10 లక్షల కార్డులు జారీ చేయనున్నారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకొచ్చారు. ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద రూ.2కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని నిర్మలా సీతారామన్ ముందుగానే వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతులను అమలుచేస్తామని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్య సేకరణ చేస్తామని ప్రకటించారు. అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని చెప్పిన నిర్మలా.. సున్నా శాతం పేదరికమే మా లక్ష్యంగా వెల్లడించారు. వికాస్ భారత్‌లో వంద శాతం క్వాలిటీ విద్య లక్ష్యమని తెలిపారు. 2024-25లో ఎకానమీ వృద్ధి అంచనా 6.4 శాతంగా పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లు సబ్ కా వికాస్ కు సువర్ణావకాశంగా వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ రుణాలు పెంపు పోస్టల్ రంగానికి కొత్త జవసత్వాలు వస్తాయని పేర్కొన్నారు.
ధన్ ధాన్య యోజన కార్యక్రమం ద్వారా దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ఇన్‌ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక ప్రకటించారు.