Rahul Gandhi: ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలను కలిపి విమర్శించిన రాహుల్ గాంధీ

దేశంలో నిరుద్యోగ సమస్యను నియంత్రించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఆశించినంత ఉద్యోగాలు సృష్టించలేదంటూ నిలదీశారు. ఉత్పత్తి దేశంగా విఫలమై దాన్ని చైనాకు అప్పగించామన్నారు.

New Update
Rahul Gandhi in Lok sabha

Rahul Gandhi in Lok sabha

Rahul Gandhi: పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాలు(Parliament Budget Session 2025) జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లోక్‌సభ(Lok Sabha)లో కాంగ్రెస్(Congress) అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఎన్డీయేతో పాటు యూపీఏ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యను నియంత్రించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఆశించినంత  ఉద్యోగాలు సృష్టించలేదంటూ నిలదీశారు.  '' మనం ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే నిరుద్యోగం. ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం. గతంలో యూపీఏ గానీ.. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం గానీ నిరుద్యోగంపై దేశ యువతకు సరైన సమాధానం ఇవ్వలేకపోయాయని'' రాహుల్ గాంధీ అన్నారు. 

Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్‌ కార్డు మార్చాలి.. స్టార్‌ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?

రాహుల్ గాంధీ విమర్శలు..

భారత్‌ ఉత్పత్తి ఆధారిత దేశంగా విఫలమై దాన్ని చైనాకు అప్పగించామన్నారు. ఇకనైనా మనం ఉత్పత్తి పైనా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మేకిన్ ఇండియా మంచి ఆలోచన. కానీ దాన్ని అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపిచారు. 

Also Read: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉండగా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం.. పూర్ థింగ్, బోరింగ్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్‌ దీనిపై కూడా స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగం చేస్తున్నప్పుడు ఇబ్బందికి గురయ్యాయని చెప్పారు. ఎందుకంటే గతంలో చేసిన ప్రసంగం లాగే ఈసారి కూడా ఉందని, అవే విషయాలు చెప్పారంటూ పేర్కొన్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు