ముస్లిం పురుషులు మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు కీలక తీర్పు

ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఓ ముస్లిం పురుషుడు ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిల్లు చేసుకోవడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి

New Update
Muslim man’s second marriage during subsistence of first marriage not bigamy, Says Madhya Pradesh HC

Muslim man’s second marriage during subsistence of first marriage not bigamy, Says Madhya Pradesh HC

ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఓ ముస్లిం పురుషుడు ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిల్లు చేసుకోవడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వివాహమైన 20 ఏళ్ల తర్వాత తనకు పిల్లలు కలగలేదనే వంకతో భర్త తనను వేధిస్తున్నాడని.. రెండో పెళ్లి చేసుకుని తనను విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ మహిళ కేసులు పెట్టింది. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన జస్టిస్ బి.పి. శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది.

Also Read: ఇరాన్‌ నుంచి బయటపడండి.. భారతీయ పౌరులకు కేంద్రం కీలక సూచనలు

 భారతీయ శిక్షా స్మృతి (IPC) లోని సెక్షన్ 494 కింద ఉన్న 'ద్విభార్యాత్వం' రూల్స్ ముస్లిం పురుషులకు వర్తించవని హైకోర్టు తెలిపింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం చూసుకుంటే ఒక పురుషుడు నలుగురు భార్యల వరకు పెళ్లి చేసుకునేందుకు పర్మిషన్ ఉందని చెప్పింది. అందుకే రెండో పెళ్లి చేసుకోవడం నేరం కిందకు రాదని పేర్కొంది. ఈ మేరకు ఆ భర్తపై ఉన్న సెక్షన్ 494 కేసును కొట్టివేసింది. మతపరమైన రూల్స్ ప్రకారం రెండో పెళ్లికి పర్మిషన్ ఉన్నప్పటికీ.. అది దేశ చట్టంలో ఉన్న అన్ని సెక్షన్ల నుండి మినహాయింపు ఉండదని కోర్టు గుర్తుచేసింది.

Also Read: అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్.. తెర వెనుక చైనా మాస్టర్ మైండ్!

రెండో పెళ్లి వ్యవహారంలో ఉపశమనం ఉన్నప్పటికీ.. భార్యను కొట్టడం (సెక్షన్ 323), వేధించడం (498-A), బెదిరింపులకు పాల్పడటం (506) లాంటి ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది. అందుకే ఈ సెక్షన్ల కింద ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. కేవలం రెండో వివాహానికి సంబంధించిన సెక్షన్‌ను మాత్రమే తాము కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

Advertisment
తాజా కథనాలు