MP Pappu Yadav: రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలి

బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కుంభమేళా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయిన వారికి మోక్షం లభిస్తుందన్నారు.

New Update
pappu

pappu

ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న కుంభమేళాలో చనిపోతే మోక్షం లభిస్తోందని బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయిన వారికి మోక్షం లభిస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

Also Read: Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు.. ముంబై, చెన్నై, బెంగళూరుకు ఇక గంటల్లోనే రయ్‌..రయ్‌!

మోక్షం పొందారని...

త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అనధికారిక లెక్కల ప్రకారం సుమారు 600 మంది వరకు చనిపోయారని ఆయన ఆరోపించారు. కనీసం వారికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారు మోక్షం పొందారని ఒక బాబా చెప్పారని.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ను ఉదేశించి పప్పు యాదవ్ కామెంట్ చేశారు.కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా లో గత నెల 30 తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. 

Also  Read:Top 10 Countries: ప్రపంచంలో టాప్‌ 10 శక్తిమంతమైన దేశాల జాబితా విడుదల.. భారత్ ఎన్నో స్థానమంటే ?

మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. మౌని అమావాస్య ను పురస్కరించుకుని పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సెక్టార్-2 ప్రాంతంలో భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. 

తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Also Read: Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు!

Also Read: Delhi Assembly election 2025 : బిగ్ షాక్..  సీఎం అతిషి ఆఫీసర్ నుంచి రూ.5 లక్షలు స్వాధీనం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment